రేఖతో నటించడానికి అమితాబ్ రెడీ

By Srikanya

మేమిద్దరం కలిసి పని చేస్తే తప్పేముంది... ఎందుకు కలిసి చేయం అంటున్నారు అమితాబ్..రేఖను ఉద్దేశించి. మంచి కథతో వస్తే రేఖతో కలిసి నటించడానికి తనకెలాంటి ఇబ్బంది లేదని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ వెల్లడించారు. రామ్ గోపాల్ వర్మ డిపార్టమెంట్ ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఆయన ఇలా స్పందించారు. అలాగే ..''మూడు దశాబ్దాల కిందట రేఖతో కలిసి నటించా. 'సిల్‌సిలా' (1981) చిత్రం తరవాత మేమిద్దరం మళ్లీ జంటగా కనిపించలేదు. ఇప్పుడు దర్శకులు ఎవరైనా మాకు సరిపడే కథతో వచ్చి సంప్రదిస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నాం '' అన్నారు.

ఇక వీరిద్దరు పై గతంలో చాలా రూమర్స్ ఉన్నాయి. వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, అందుకే రేఖ పెళ్లి చేసుకోలేదని, ఈ నేపధ్యంలో ఈ జంటపై అందరికీ అసక్తి ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి 'దో అంజానే' (1976), 'ముఖందర్‌ కా సికందర్‌' (1978), 'మిస్టర్‌ నట్వర్‌లాల్‌', 'సుహాగ్‌' (1979) తదితర సినిమాల్లో కలిసి నటించారు. అయితే ఇప్పుడు వీరి వయస్సుకు తగిన పాత్రలతో కనపిస్తే ఎంతవరకూ ఆదరిస్తారో చూడాల్సిన అంశం.

డిపార్టమెంట్ చిత్రం విషయానికి వస్తే...ముంబైలోని మాఫియాని ఎలిమినేట్ చేయటానికి ఏర్పాటైన ఏంటి టెర్రరిస్టు స్క్వాడ్ గురించి..ఆ క్రమంలో పోలీస్ డిపార్టమెంట్ ఎదుర్కొనే స్ట్రగుల్స్ గురించి ఉంటుందని అన్నారు.ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ..గ్యాంగస్టర్ గా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర పేరు సర్జేరావు గైక్వాడ్. అలాగే దగ్గుపాటి రానా పోలీస్ అధికారిగా,సంజయ్ దత్ ఓ కీలకమైన రోల్ ని పోషిస్తున్నారు. మంచు లక్ష్మి..సంజయ్ దత్ కి భార్యగా కనిపించనుంది. డిపార్టమెంట్ చిత్రం వచ్చే నెల 18న విడుదల కానుంది.

వీళ్లు కాకుండా తెలుగులోని దగ్గుపాటి రానా,లక్ష్మి మంచు,మధు షాలని కూడా చాలా ముఖ్యపాత్రల్లో ఉన్నారు. మధు షాలిని ఫిమేల్ గ్యాగస్టర్ రోల్ ని పోషిస్తోంది.ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు నవంబర్ లో ముగించుకుని పిభ్రవరిలో రిలీజ్ చెయ్యటానికి సన్నాహాలు చేసుకుంటోంది.ఇక మధుశాలిని పాత్ర సినిమాకి హైలెట్ కానుందని చెప్తున్నారు.ఆమె సినిమా అంతా పూర్తిగా సిగెరెట్ కాలుస్తూంటుంది.ఆమె ఇంతకాలం సాఫ్ట్ రోల్ లో కనిపించింది.ఇప్పుడు చాలా వైల్డ్ గా ఉండే పాత్రలో అదరకొట్టనుందని,ఆమె పాత్ర సినిమాకి హైలెట్ అని చెప్తున్నారు.

డిపార్టమెంట్ చిత్రం పోలీస్ వ్యవస్దకి,అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్ మధ్యన ఉండే సంభందాలని ముఖ్య కధా వస్తువుగా తీసుకుని మలచటం జరిగింది.దీంట్లో అమితాబ్ ఒక రాజకీయ నాయకుడుగా మారిన ఎక్స్ క్రిమినల్ పాత్రను పోషిస్తున్నాడు.సంజయ్ దత్ అండర్ వరల్డ్ ని సమూలనంగా నాశనం చెయ్యటానికి సృష్టించిన డిపార్టమెంట్ కి లీడర్ లోల్ వేస్తున్నారు.అభిమన్యు సింగ్ ఒక క్రూరమైన క్రిమినల్ రోల్ ని పోషిస్తున్నాడు. విజయ్ రాజ్ పరారీలో ఉన్న ఒక మాఫియా డాన్ రోల్ పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X