»   » సినిమా ఎఫెక్ట్: అసలైన ‘బాహుబలి’ మరుగున పడ్డాడు!

సినిమా ఎఫెక్ట్: అసలైన ‘బాహుబలి’ మరుగున పడ్డాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' అంటే ఎవరు అని నేటితరం జనరేషన్ ను అడిగితే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా అని చెబుతారు. ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ఇపుడు అందరూ గూగుల్ బాట పడుతున్నారు. గూగుల్ సెర్చిలో కూడా అసలైన బాహుబలి మరుగున పడ్డాడు. రాజమౌళి ‘బాహుబలి' గురించే గూగుల్ చూపిస్తోంది.

కానీ వాస్తవానికి అసలైన బాహుబలి.... వేరే ఉన్నాడు. జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు లేదా వృషభనాథుడు, సునందల కుమారుడు బాహుబలి. బాహుబలి సహనానికి కెరాఫ్ అడ్రస్ లాంటి వాడు, యుద్దాన్ని వద్దన్న శాంతిదూత, రాజ్యాల కోసం తలలు నరుక్కుంటుంటే రాజ్యాన్నే గడ్డిపోచగా భావించిన వ్యక్తి అతను. సుఖాల కోసం, భోగాల కోసం పరితపిస్తుంటే రాజుగా ఉండి కూడా సాధు జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి అతను.


ఇతనికే గోమఠేశ్వరుడనే పేరు కూడా ఉంది. ఇతడికి ఇద్దరు భార్యలు. రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు. పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజదాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకుల రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు. భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది. తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు. బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడు.


Real Baahubali story

స్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్దంలో అనవసరమైన ప్రాణనష్టాన్ని వద్దని ద్వంద్వ యుద్దం చేసి గెలుస్తాడు. భరతుడిని చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి, అంతలోనే పునరాలోచనలో పడతాడు. బాహుబలి ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి, రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు. మన దేశంలో బౌద్దజైన మతాలు రెండూ దాదాపుగా ఒకే సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ బౌద్దం వ్యాపి చెందినంతగా జైనం విసృతం కాలేదు.


జైన మతంలో సన్యాసులు పాటించిన నియమాలు మరీ కష్టమైనవి కావడంతో దీన్ని ఆచరించడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు. కఠిన నియమాల కారణంగానే శ్వేతాంబరులు, దిగంబరులు అని రెండు వర్గాలుగా విడిపోయారు. శ్వేతాంబరులు ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఉన్నారు. వీరు ససార జీవితం కొనసాగిస్తారు. దిగంబరులు సన్యాసులు. వీరు దైవ చింతనలో ఉంటూ శరీరాన్ని కృశింప చేసి నిర్యాణం పొందే దీక్షలో ఉంటారు. బాహుబలి విగ్రహం కర్నాటక లోని శ్రావనబెళగొళ లో ఉంది. 58 అడుగులున్న ఈ విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. క్రీ.శ.983వ సంవత్సరంలో ఇంద్రగిరి పర్వతంపై ఈ విగ్రహాన్ని చెక్కించినట్లు చారిత్రక కథనం.

Read more about: baahubali, prabhas, rajamouli
English summary
Bahubali was the son of Rishabha, the first tirthankara and founder of Jainism in the present half-cycle of time. Bahubali is a much revered figure among Jains.
Please Wait while comments are loading...