»   » "రియల్ దండుపాళ్యం" రిలీజ్‌కు సిద్దం

"రియల్ దండుపాళ్యం" రిలీజ్‌కు సిద్దం

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  శ్రీ వైష్ణోదేవి మూవీస్ పతాకంపై నారాయణ భట్ సమర్పించు చిత్రం 'రియల్ దండుపాళ్యం'. కన్నడ ఫేమ్స్ రాగిణీ ద్విగేది, మేఘన రాజ్, దీప్తి, ప్రథమ ప్రసాద్, సంయుక్త హొర్నాడ్ లు నటించగా, సి. పుట్టు స్వామి నిర్మాతగా వ్యవహరించారు. మహేష్ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

  Dandupalyam 2 Movie Leaked Scene, Sanjana Hot video

  ఈ సందర్భంగా నిర్మాత పుట్టు స్వామి మాట్లాడుతూ.. "తెలుగులో ఇదివరకే 3 సినిమాలు చేశాను. అన్నీ విజయవంతం అయ్యాయి. ఇప్పటి వరకు ఎవరూ చేయని డిఫరెంట్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ మహేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా పూర్తి అయ్యాక చూస్తే.. నేనే థ్రిల్ అయ్యా. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సినిమా ఎంతో అవసరం. కన్నడలో పెద్ద హీరోయిన్స్ కూతుర్లే ఈ సినిమాలో నటించిన నలుగురు హీరోయిన్స్. చాలా బాగా నటించారు.

  Real Dandupalyam getting release in July last week

  ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే చట్ట పరంగా ఏర్పడిన చర్యను వారు ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ రియల్ దండుపాళ్యం కాన్సెప్ట్. మంచి సందేశాత్మక చిత్రం. ప్రస్తుతం సెన్సార్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. తెలుగు, కన్నడ భాషల్లో ఈ నెలాఖరున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అందరికీ నచ్చే చిత్రమవుతుందని ఆశిస్తున్నాను.." అన్నారు.

  Real Dandupalyam getting release in July last week

  రాగిణి ద్వివేది, మేఘన రాజ్, దీప్తి, ప్రధమ ప్రసాద్, సంయుక్త హర్నడ్, యువరాజ్, రఘు బట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీధర్. వి. సభ్రం, మాటలు-పాటలు: భారతీ బాబు, పివి ఎల్ ఎన్ మూర్తి, నిర్మాత: సి. పుట్టు స్వామి, డైరెక్టర్: మహేష్.

  English summary
  Director Mahesh's Real Dandupalyam trailer released recently. Five Kannada Heroines daughter worked for this movie. Producer Puttu Swamy said that he was thrilled watching this movie. This movie set to release in July last week.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more