ప్రతీ విషయంలో ఫెరఫెక్షన్ కోరుకునే అరుదైన నటుడు పవన్ కళ్యాణ్. ఆయన ప్రస్తుతం ఖుషి దర్శకుడు యస్.జె.సూర్య కాంబినేషన్ లో పులి చిత్రం చేయబోతున్నారు. అందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ విభిన్నంగా కనిపిస్తారట. ఇక ఆ పాత్రలో లీనమవ్వటానికి నిజ జీవితంలో పోలీస్ ఆఫీసర్ల బాడీలాంగ్వేజ్, స్టైల్ ఎట్లా ఉంటుందో నేర్చుకుంటున్నారు. అందు కోసం ఆయన ఓ ఉన్నత స్ధాయి పోలీసు అథికారి సమక్షంలో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. ఇంతకు ముందు కమల్ హాసన్ వంటి విలక్షణ నటులు మాత్రమే ఇటువంటి ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు పవన్ కూడా అదే దారిలో పయినించబోతున్నారు. అలాగే మొనాటిని గా మారుతున్న మానరిజమ్స్ ని ప్రక్కన పెట్టి ఈ చిత్రంలో నటనతో ప్రత్యేక ముద్ర వెయ్యాలని ఆశిస్తున్నారు. ఇది తెలిసిన అభమానులు త్వరలో ఖుషి ని మించిన మెగా హిట్ ఫిలిం రాబోతోంది అని ఆనందపడుతున్నారు.
Story first published: Wednesday, April 22, 2026, 8:12 [IST]