twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈసారి ఎన్టీఆర్ ని రాజమౌళి కూడా ఏం చేయలేడు..?

    By Sindhu
    |

    జూ ఎన్టీఆర్ మళ్లీ ప్రమాదం అంచులకి చేరుకుంటున్నాడు. గతంలో విపరీతంగా ఒళ్లు చేసి హీరో ఫీచర్స్ కోల్పోయిన జూనియర్ ఎన్టీఆర్ కి రాజమౌళి బ్రెయిన్ వాష్ తో బుద్దొచ్చింది. 'రాఖీ"లో దారుణంగా కనిపించిన వాడల్లా, లైపో చేయించుకుని 'యమదొంగ"లో స్లిమ్ గా కనిపించాడు. 'కంత్రి"కి ఇంకా కొవ్వు కరిగించేసుకుని అల్ట్రా స్లిమ్ అయిపోయాడు.

    అయితే మళ్లీ ఇటీవల జూ ఎన్టీఆర్ బరువు పెరుగుతున్నాడు. శక్తి సినిమా లో రుద్ర పాత్రలోనే ఎన్టీఆర్ తిరిగి పూర్వ దశకి చేరుకుంటున్న ఛాయలు కనిపించాయి. ఇక ఊసరవెల్లి సినిమా స్టిల్స్ చూస్తుంటే ఎన్టీఆర్ మళ్లీ డేంజర్ జోన్ లోకి వెళుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎప్పుడంటే అప్పుడు లైపో చేయించుకోవడం ప్రమాదకరం కాబట్టి ఈసారి పరిస్థితి పూర్తిగా కంట్రోల్ తప్పకముందే ఎన్టీఆర్ కంట్రోల్ లోకి వచ్చేస్తే బాగుటుంది. లేదంటే ఈసారి జూ ఎన్టీఆర్ ని రాజమౌళి కూడా ఏం చేయలేడు..

    అసలు జూ ఎన్టీఆర్ ఎందుకు అంత బరువు పెరుగుతున్నాడు అంటే..? ఊసరవెల్లి రంగులు మారినట్టు తనకూడా సినిమాకు తగ్గట్టు ఉండాలన్న కొద్దికొద్దిగా సినిమా కోసమే బరువు పెరిగారంటున్నారు సన్నిహితులు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 6 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత బి.వి.యస్.ఎన్.ప్రసాద్ చెబుతున్నారు. జూ ఎన్టీఆర్ ని ఓ కొత్త కోణంలో చూపించే పక్కా కమర్షియల్ సినిమాగా ఊసరవెల్లి రాబోతుంది.

    English summary
    When the stills of ‘Oosaravelli’ came out, people started commenting about how NTR appeared to have put on weight. Tongues started wagging that NTR was slowly going back to his old ways. This had fans worried. But we have come to know about the reason behind the ‘weight gain’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X