Srihari Death Mystery: ఆ ఇంజెక్షన్ వల్లే బావ చనిపోయాడు... శ్రీహరి భార్య సెన్సెషనల్ కామెంట్స్
రియల్ స్టార్ శ్రీహర గురించి మన అందరికీ తెలిసిందే. ఆయన ముంబైలో గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పుకొచ్చారు. ఏదో సినిమా పని మీద వెళ్లిన ఆయన.. గుండెపోటుకు గురై అక్కడే చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఆయన మరణంపై శ్రీహరి భార్య డిస్కో శాంతి ఆసక్తి కర విషయాలు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె... శ్రీహరి ఆ ఇంజెక్షన్ వల్లే చనిపోయారంటూ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...
హీరో శ్రీహరి మొదట్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా మెప్పించి... హీరోగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఇక పలు సినిమాల్లో హీరోగా నటించిన ఆయన... సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ఇక పలు సినిమాల్లో నటిస్తున్న ఆయన.. కెరీర్ పీక్స్ లో ఉంది అనగా సడెన్ గా మరణించారు. ఏదో సినిమా విషయమై ముంబై వెళ్లిన ఆయన గుండె పోటుకు గురైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇక శ్రీహరి మరణం ఇప్పటికీ మిస్టరీగా ఉండిపోయింది. తాజాగా ఆయన భార్య డిస్కో శాంతి శ్రీహరి మరణం గురించి ఆసక్తికర విషయాలు బయట పెట్టింది. ఆయన మరణించింది.. గుండె పోటుతో కాదు.. ఆ ఇంజెక్షన్ వల్లే అంటూ సెన్సెషనల్ కామెంట్స్ చేసింది. ఆమె కళ్ల ముందే శ్రీహరి చనిపాయడు అంటూ ఆవేదన చెందింది. దీనికి అంతటికి కారణం ఆ ముంబయి లోని డాక్టర్స్ అంటూ బోరున విలపించింది.
శ్రీహరి భార్య డిస్కో శాంతి మాట్లాడుతూ... చనిపోయే ముందురోజు ముంబై బావ (శ్రీహరి) నుంచి కాల్ చేసి..పిల్లలతో మాట్లాడారు... సాయంత్రం కల్లా వస్తాను అన్నారు. ఆయన మరణానికి కారణం హార్ట్ అటాక్ అని చెప్పారు. ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించాకా నేను వెళ్లాను... ఆసుపత్రి లోపలకిి వెళ్లాను.. ఆయన కళ్లు మూసి ఉన్నాయి... నన్ను బయటకు పంపించారు. మళ్లీ వెళ్లి చూస్తే.. కళ్ల నుంచి, చెవుల్లోంచి రక్తం కారుతోంది. అక్కడ ఉండే డ్యూటీ డాక్టర్.. బావకు (శ్రీహరికి) సెలెన్ లో ఓ ఇంజెక్షన్ కలిపారు. ఆ ఇంజెక్షన్ తర్వాతే ఆయనకు బ్లడ్ రావడం జరిగిందంటూ చెప్పుకొచ్చారు.

ఆమె మాట్లాడుతూ... నన్ను బయటకు పంపించేశారు. నేను మళ్లీ లోపలకి వెళ్లే సరికి అంతా తుడిచేశారు. కానీ కింద మొత్తం ఫుల్ బ్లడ్.. చూసి బయపడ్డాను. నేను 100 పర్సెంట్ చెప్పగలను... ఆయనకు రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చారు. అందుకే బావ( శ్రీహరి) చనిపోయారు. అక్కడ నాకు హింది రాదు.. ఆయన ఎవరో వారికి తెలియదు.. అదే ఇక్కడ అయితే... శ్రీహరి బతికేవారు. ఇక్కడ నా బదులు ఆయన కూర్చుని ఉండేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయాలో అర్ధం కాలేదు. ముంబైలో చిక్కుకుపోయామంటూ వెల్లడించింది.

ఇక మా కుటుంబ సభ్యుల సాయంతో... ఇంటికి తీసుకువచ్చాం. చిరంజీవి ఠాగుర్ సినిమాలో జరిగినట్లు.. చనిపోయిన తర్వాత కూడా డబ్బులు కట్టించుకుంటారు కదా.... అక్కడ అలా జరిగిందని ఆవేదన చెందారు. ఇక డిస్కో శాంతి కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆమె ఎక్కువగా ఐటెం సాంగ్స్ లో కనిపించారు.


Click it and Unblock the Notifications











