అపుడు రూ. 1 కోటి ఇచ్చిన వరుణ్ తేజ్: నాగబాబు జనసేనలో చేరికపై ఏమన్నారంటే..!

Recommended Video

Mega Family Support To Janasena | Ram Charan | Varun Tej | Filmibeat Telugu

మెగా బ్రదర్ నాగబాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరడంతో పాటు నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు బయటి నుంచి సపోర్ట్ ఇస్తూనే అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన నాగబాబు... ఇక నుంచి జనసేన ప్రతినిధిగా ఆచితూచి వ్యవహరించబోతున్నారు.

నాగబాబు జనసేనలో చేరడంతపై ఆయన తనయుడు, యువ నటుడు వరుణ్ తేజ్ స్పందించారు. 'నాన్న జనసేన పార్టీలో చేరడం, బాబాయితో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఆనందంగా ఉంది ' అంటూ ట్వీట్ చేశారు.

ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

నాగబాబు జనసేనలో చేరడంపై ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ‘‘చిన్నప్పుడు వేలు పట్టుకొని నడక నేర్పిన అన్నయ్యనే ఈ రోజు చెయ్యి పట్టుకుని ప్రజాక్షేత్రంలో అడుగులు వేయించే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదిగారు' అంటూ కామెంట్స్ గుప్పిస్తున్నారు.

వరుణ్ తేజ్ భారీ విరాళం

వరుణ్ తేజ్ భారీ విరాళం

జనసేన పార్టీ కోసం వరుణ్ తేజ్ రూ. 1 కోటి విరాళం అందించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి ఇంత పెద్ద మొత్తం విరాళం జనసేన పార్టీకి వెళ్లడం ఇదే తొలిసారి. జనసేన పార్టీలో చేరకముందే నాగబాబు రూ. 25 లక్షలు విరాళం అందించారు.

పవన్ కళ్యాణ్‌కు సపోర్టుగా మెగా ఫ్యామిలీ

పవన్ కళ్యాణ్‌కు సపోర్టుగా మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీ హీరోలంతా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఉన్నారు. ఆయన నుంచి పిలుపు వస్తే చాలు తాము వెళ్లి ఏం చేయడానికైనా సిద్ధమని రామ్ చరణ్ కూడా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

వరుణ్ తేజ్

వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.... 2019లో ‘ఎఫ్ 2' మూవీతో టాలీవుడ్లో తొలి విజయం నమోదు చేసిన వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మీకి అనే చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X