‘వల్లభనేని వంశీని, నన్ను ఎన్‌‌కౌంటర్ చేస్తానని ఆ ప్లేస్‌కి .. జూ.ఎన్టీఆర్‌‌కీ ఆ ల్యాండ్‌లో’

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతి నుంచి వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ కనిపించడం లేదు . ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే తనను టార్గెట్ చేస్తారని ఆయన తొలి నుంచి సన్నిహితులతోనూ, మీడియాతోనూ చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన అరెస్ట్ తప్పదని గ్రహించిన ఆయన కొంతకాలంగా అజ్ఞాతంలోనే ఉంటున్నారు.

వంశీ హైదరాబాద్‌లో లేరని.. అమెరికా వెళ్లిపోయారంటూ ప్రచారం జరిగింది. గత నెలలో హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా వంశీని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నిజానికి వల్లభనేని వంశీ రాజకీయాల్లోకి రాకముందు వెటర్నరీ డాక్టర్. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీలో వెటర్నరీ సైన్స్ పూర్తి చేసిన ఆయన అమెరికా వెళ్లాలనుకున్నారు.

realtor chinna srisailam Yadav recalls when his land dealings with ysrcp leader vallabhaneni vamsi mohan and tollywood star jr ntr here s the details

కానీ కొన్ని కారణాలతో వంశీకి వీసా రాలేదు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. ఈ తరుణంలోనే ఆయనకు టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్రతో పరిచయం ఏర్పడింది. తక్కువ సమయంలోనే రవికి ప్రధాన అనుచరుడిగా ఎదిగారు వంశీ. ఇద్దరూ కలిసి పలు వ్యాపారాలు , సెటిల్‌మెంట్లు చేశారని పొలిటికల్ వర్గాల్లో ఇప్పటికీ చర్చించుకుంటూ ఉంటారు.

ఆర్ధికంగా స్ధిరపడ్డాక సినీ పరిశ్రమలోనూ వంశీ అడుగుపెట్టారు. పలు చిత్రాలకు పంపిణీదారుడిగా, నిర్మాతగానూ వ్యవహరించారు. జూనియర్ ఎన్టీఆర్‌తో అదుర్స్, పున్నమినాడు, రవితేజతో టచ్ చేసి చూడు వంటి సినిమాలు తీశారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సమయంలో వంశీ కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నారట. ఓ కేసులో పోలీసులు ఆయనను ఎన్‌కౌంటర్ చేసే వరకు వెళ్లిందట . ఈ విషయాన్ని టీడీపీ నేత, హైదరాబాద్‌లో కరడుగట్టిన రౌడీషీటర్‌గా పేరు తెచ్చుకున్న చిన్న శ్రీశైలం యాదవ్ తెలిపారు.

సెటిల్మెంట్లకు , రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిన్నశ్రీశైలం ఇటీవలి కాలంలో పలు ఛానెళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన జీవితంలో ఎదుర్కొన్న పరిణామాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ల్యాండ్ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. ఓ కేసులో వంశీకి సంబంధం లేకపోయినా తనను , ఆయనను అరెస్ట్ చేశారని చిన్నశ్రీశైలం తెలిపారు. ఎంక్వైరీ పేరిట ఇద్దరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారని , ఎన్‌కౌంటర్ కూడా చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చి ఆ తర్వాత వదిలేశారని పేర్కొన్నారు.

realtor chinna srisailam Yadav recalls when his land dealings with ysrcp leader vallabhaneni vamsi mohan and tollywood star jr ntr here s the details

ఇద్దరం కలిసి వ్యాపారం చేసినట్లుగా ప్రచారం జరిగిందని.. ఓ ఏరియాలో 748 ఎకరాల ప్రాపర్టీ ఉంటే వంశీ, నేను విడివిడిగా కొన్నామని చిన్న శ్రీశైలం తెలిపారు. అందులోనే పరిటాల రవి, జూనియర్ ఎన్టీఆర్‌ కూడా భూములు కొన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీ దగ్గర భూములు కొన్నవాళ్లు న్యూసెన్స్ చేశారని.. తాము నిబంధనల ప్రకారం రైతుల వద్దే కొని వ్యాపారం చేశామని చిన్నశ్రీశైలం వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X