యాక్టర్ సనా కూతురు విడాకులు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సీనియర్ నటి
తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి సనా బేగం. తాజాగా సనా ఓ ఇంటర్వ్యూలో తన కూతురుకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడింది. మరి ఆమె కూతురు ఎందుకు విడాకులు తీసుకుంది? అనే విషయాన్ని మనం కూడా తెలుసుకుందాం పదండి.
చిన్నప్పుడే పెళ్లి చేసుకున్న సనా మోడల్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడతా సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్ కు మంచి గుర్తింపు దక్కింది. అలాగే చక్రవాకం అనే సీరియల్ ద్వారా మరింత పాపులారిటీని మూటగట్టుకుంది సనా.

అంతేకాకుండా ఓవైపు సినిమాలు మరోవైపు సీరియల్స్ చేస్తూనే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తోంది. నటిగా సక్సెస్ ఫుల్ గా ఎదిగిన సనా రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ తో పాటు కెరీర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
సనా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఇంటర్ చదివే సమయానికి పెళ్లి చేసేసుకున్నాను అని, తన తండ్రికి వ్యాపారంలో అప్పట్లో లాస్ రావడం కారణంగా అంత త్వరగా పెళ్లి చేశారని గుర్తు చేసుకుంది. ఇక తను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను అంటే తన అత్తింటి వారే కారణం అంటూ వాళ్లను పొగడ్తలతో ముంచెత్తింది.

వారి ప్రోత్సాహం కారణంగానే బి.ఎడ్ వరకు చదివి ఆ తర్వాత తనకు ఇష్టమైన మోడలింగ్ వైపు అడుగు వేసానని చెప్పుకొచ్చింది. అత్తమ్మ వాళ్ళ సహకారంతో యాడ్స్ చేస్తున్న తనకు నిన్నే పెళ్ళాడతా సినిమాలో అవకాశం రావడంతో ఒక్కసారిగా తన లైఫ్ మారిపోయిందని చెప్పుకొచ్చింది సనా.
ఇక సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సనా ఇద్దరు పిల్లలు పుట్టాకే పాపులారిటీని సంపాదించుకుంది. అంటే ఆమె సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడానికంటే ముందే తల్లి అయ్యింది. అయితే సనా తన పిల్లలను మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురాకపోవడం గమనార్హం.

తన కూతురికి సినిమాల పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె సినిమాలు చేయలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తన కూతురు చదువు పూర్తయ్యాక పెళ్లి చేసి అత్తారింటికి పంపగా, వాళ్ళు దారుణంగా మోసం చేశారని వాపోయింది ఈ సీనియర్ నటి.
దుబాయ్ లో ఇల్లు ఉంది అని చెప్పి అక్కడికి తీసుకెళ్లి ఆమెను బాగా చిత్రహింసలు పెట్టారని, ఒకచోట ఉంచామని చెప్పి మరోచోట తనను బంధించారని, ఇవన్నీ తెలుసుకున్న తాము తనను అక్కడి నుంచి తీసుకొచ్చి పోలీసుల సహాయంతో వారిని అరెస్ట్ చేయించామని సనా తన కూతురి విడాకుల గురించి వెల్లడించింది.
ఇక ఈ విషయంలో తెలంగాణ పోలీసుల సహకారం మరువలేనిది అంటూనే తన కూతురికి జరిగిన అన్యాయాన్ని బయట పెట్టింది. ఆ సమయంలో తనతో పాటే కొడుకు, భర్త కూడా కూతురుకి అండగా నిలబడ్డామని, ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ చేస్తూ తన కూతురిని చూసుకుంటుందని పేర్కొంది సనా.


Click it and Unblock the Notifications











