మీడియాను బకరా చేసిన నిహారిక విడాకుల వ్యవహారం... ఫస్ట్ పిటిషన్ ఎవరు వేశారంటే?
గత కొద్ది రోజులుగా మెగా డాటర్ నిహారిక కొణిదెల - చైతన్య జొన్నలగడ్డ విడివిడిగా ఉండటం వల్ల వీరిద్దరు విడిపోయారని వార్తలు వచ్చాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ.. జులై 4న ఈ విషయంపై అధికార ప్రకటన వచ్చింది. నిహారిక కొణిదెల - చైతన్య జొన్నలగడ్డ విడిపోయినట్లు స్పష్టత వచ్చింది. అయితే వీరద్దరిలో ఎవరు ముందుగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు? నిహారిక తరపున కోర్టులో పిటిషన్ వేసిందెవరు? అంటూ కొంతమంది నెటిజన్లు, మెగా అభిమానులు సోషల్మీడియాలో ఆరా తీస్తున్నారు. ఆ వివరాలు..
నిహారిక కొణిదెల - చైతన్య జొన్నలగడ్డ మంగళవారం తమ వైవాహిక బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో వీరికి విడాకులు ముంజూరు అయ్యాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతోనే విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. అయితే తాజాగా మరిన్ని విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.

కోర్టు కాపీలో ఏముందంటే.. :అయితే మొదటగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది జొన్నలగడ్డ చైతన్యనే అని తెలిసింది. ఈ విషయం కోర్టు విడుదల చేసిన కాపీలో ఉంది. ఏప్రిల్ 1న పిటిషన్ ఫైల్ అయిందట. ఆ తర్వాత నిహారిక కూడా అందుకు అంగీకరించి.. తాను కూడా డివొర్స్ కోసం పిటిషన్ దాఖలు చేసిందట. నిహారిక తరఫున ఆమె అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర పిటిషన్ వేశారట.
ఈయన నాగబాబుకు అత్యంత దగ్గరగా, సన్నితంగా ఉండే వ్యక్తి అని తెలిసింది. విడాకుల విషయాన్ని గోప్యంగా ఉంచాలని ముందే అనుకున్నారట. మొదటి హియరింగ్ మే 19న జరిగినట్లు తెలిసింది. రెండో హియరింగ్ మే 29న జరిగినట్లు ఉంది. అనంతరం మూడో హియరింగ్లో తుది నిర్ణయం జూన్ 5న తీసుకున్నారట. ఆ రోజే విడాకులు మంజూరు చేశారని అందులో ఉంది. అంటే ఆలస్యంగా ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.

మీడియాని బకరా.. :ఈ విడాకులు మంజూరు అయి దాదాపు నెల రోజులు అయింది. అంటే ఈ విషయాన్ని నెల రోజుల గోప్యంగా ఉంచారు. ఈ విషయం తెలీక మీడియా ఛానళ్లు, సోషల్ మీడియా వాళ్లు.. చైతన్య-నిహారిక దూరంగా ఉంటున్నారు, విడిపోయినట్టేనా, వీరిద్దరికి ఏమై ఉంటుంది? అంటూ రోజూ వార్తలు రాసుకుంటూనే ఉన్నారు. అదేదో ముందే చెప్పి ఉంటే.. ఇంత ఉండేది కాదు కదా కొంతమంది నెటిజన్లు అంటున్నారు.

విడాకులకు కారణం ఇదేనా.. :గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్లే.. ఈ డివొర్స్కు దారితీసి ఉంటాయని సోషల్మీడియాలో చర్చ సాగుతోంది. మరికొంతమంది మెగా అభిమానులు.. పరస్పర విభేదాల వల్లే ఈ జంట విడిపోయి ఉంటారని అంటున్నారు. ఇకపోతే పెళ్లి తర్వాత నిహారిక చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఓసారి పబ్ పార్టీ డ్రగ్స్ విషయంలో ఆమె పేరు బాగా చర్చనీయాశంమైంది. ఆ తర్వాత ఓ సారి వారు ఉంటున్న అపార్ట్‌మెంట్ వాళ్లతో గొడవ జరిగిందంటూ మరో వివాదం బయటకు వచ్చి స్టేషన్ వరకు వెళ్లింది.


Click it and Unblock the Notifications











