Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రవిబాబు 'మనసారా' ప్లాపుకి ప్రధాన కారణం!?
కొత్త వాళ్ళను పరిచయం చేస్తూ అల్లరి రవిబాబు రూపొందించిన 'మనసారా' చిత్రం రెండు వారాల క్రితం విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దానికి కారణం సరైన పబ్లిసిటీ లేకుండా మీడియాకు దూరంగా లో ప్రొఫైల్ లో చిత్రాన్ని ఉంచి విడుదల చేయటమేనని అంటున్నారు. దానికి కారణం ...ప్యాకేజి విధానం అని సీనియర్స్ విమర్శిస్తున్నారు. ప్యాకేజి పద్దతి ప్రకారం..సినిమాకు పరిమితమైన బడ్జెట్ విధించుకుని పూర్తిచేస్తారు. దర్శకుడుతో ముందే ఇంతలో తీసి ఇస్తానని ఎగ్రిమెంట్ ఉంటుంది. దాని ప్రకారం ఎక్కువైనా తక్కువైనా నిర్మాతకు సంభంధం లేదు.
అయితే తన తెలివితో బడ్జెట్ కంట్రోలు చేసుకుంటూ తక్కువలో చేస్తే దర్శకుడుకి డబ్బులు మిగులుతాయి. దాంతో 'మనసారా' చిత్రం ఈ స్కీమ్ లోనే చేసి పబ్లిసిటీ దగ్గరకు వచ్చేసరికి రవిబాబు దాని బడ్జెట్ దానికి కేటాయించలేదు. తన పేరు మీద క్రేజ్ వస్తుందని, ప్రోమోలు చూసే జనం ఎగబడటాడని భావించాడు. అయితే ఆయన ఎక్సపెక్ట్ చేసినట్లు జరగలేదు. హీరో,హీరోయిన్స్ ఇద్దరూ కొత్తవారు కావటంతో సరిగా రిజిస్టర్ కాలేక ఓపినింగ్స్ తెచ్చుకోలకపోయింది. ఓపినింగ్స్ ఉండి ఉంటే మినిమం ఒక వారంలో ఎంతో కొంత రికవరీ ఉండేదని అంటున్నారు.
అలాగే టాక్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పుట్టాలంటే మొదట జనం ఆ సినిమా చూసినప్పుడే కదా అని విశ్లేషిస్తున్నారు. జనానికి ఈ సినిమా వచ్చిందని తెలిసేలోపల ధియోటర్స్ కలెక్షన్స్ లేక వీడిపోయింది. దాంతో ఈ ప్యాకేజ్ స్కీమే రివర్స్ లో ఈ సినిమాని దెబ్బ కొట్టిందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం హీరో విక్రమ్..నిర్మాత ప్రకాష్ బాబు కుమారుడు. హీరోయిన్ గా పరిచయమవుతున్న శ్రీ దివ్య తెలుగు అమ్మాయే. ఆమె కొన్ని టీవీ సీరియల్స్ లో నటించింది.