»   » అంతా రాత్రే, ప్రెగ్నెన్సీ: అందుకే జబర్దస్త్‌కు అనసూయ దూరం

అంతా రాత్రే, ప్రెగ్నెన్సీ: అందుకే జబర్దస్త్‌కు అనసూయ దూరం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ అనసూయ....గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. న్యూస్ రీడర్ గా కోరీర్ మొదలు పెట్టిన అమ్మడు తర్వాత ‘బబర్దస్త్ కామెడీ షో' ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అప్పట్లో ఆమె ఈ షో నుండి ఉన్నట్టుండి తప్పుకుంది. ఆమె స్థానంలో రష్మి వచ్చేసింది.

అసలు జబర్దస్త్ కార్యక్రమం నుండి అనసూయ ఎందుకు తప్పుకుందనే విషయమై అప్పట్లో రకరకాల వార్తలు వినిపించాయి. అనసూయ ఓవరాక్షన్ ఎక్కువయిందని కొందరు....రెమ్యూనరేషన్ పెంచమని డిమాండ్ చేసిందని మరికొందరు...ఇలా రకరకాలుగా చర్చించుకున్నారు.

అయితే అసలు విషయం ఏమిటనేది తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ బయట పెట్టింది. నేను ప్రెగ్నెంట్ అయ్యాక షో వదులుకున్నాను. ఈ షో షూటింగ్ అంతా రాత్రి పూటే ఉంటుంది. అందుకే ఆరోగ్యం పాడవుతుందనే కారణంతో అప్పట్లో ఈ షో వదులు కోవాల్సి వచ్చింది అంటోంది అనసూయ. ఆ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో ప్రస్తుతం చాలా షోలోకు యాంకరింగ్ చేసే అవకాశం దక్కించుకుంది అనసూయ.

Reason Behind Anasuya Leaves Jabardasth Show

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నాగార్జున మరదలిగా..?

‘మనం' ఘనవిజయం తర్వాత అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా'. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి (‘అందాల రాక్షసి' ఫేం) కథానాయికలుగా నటిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో కల్యాణ్‌కృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘మనం' చిత్రానికి పనిచేసిన ఛాయాగ్రాహకుడు పి.ఎస్‌.వినోద్‌ ఈ సినిమాకీ వర్క్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున మరదలి పాత్రలో హాట్ యాంకర్ అనసూయ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాలో నాగార్జున, అనసూయల మధ్య బావా మరదళ్ల సరసాలు, రొమాంటిక్ సీన్లు ఉంటాయని టాక్. నాగార్జునతో కలిసి ఓ పాటలో ఆమె డాన్స్ కూడా చేస్తుందని అంటున్నారు. హాట్ అండ్ సెక్సీ లేడీ, ఐటం గర్ల్ హంసా నందిని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో నాగ్ రెండు పాత్రలు చేయనున్నారు. సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందని అంటున్నారు. యాంకర్ అనసూయ బుల్లి తెర ప్రేక్షకులు సుపరిచితం. ఆమె పాత్ర కూడా సినిమాకు ప్లస్సయ్యేలా ఉంటుందని అంటున్నారు.

English summary
“I’m four months pregnant and expecting my second child when Jabardasth was going on. That time I cannot afford to go for night shoots and that led to my exit”, shared Anasuya in an interview.
Please Wait while comments are loading...