Jr.NTR ఫ్లెక్సీలని తీయించిన బాలకృష్ణ.. అసలు రీజన్ ఇదా.. కానీ ఫాన్స్ ఏంటి ఇలా అంటున్నారు!
నందమూరి ఫ్యామిలీలో బాబాయి వర్సెస్ అబ్బాయి.. వార్ ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ విభేదాలు మళ్లీ బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయగా.. వాటిని బాలయ్య తొలగించమని ఆదేశాలు జారీ చేశాడు. దీంతో అక్కడే రచ్చ మొదలు అయింది. అయితే ఈ విషయంపై టీడీపీ వర్గాలు మరో విధంగా కారణాలు చెబుతున్నారు. బాలయ్య అలా అనడానికి ఓ రీజన్ ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా.. ఎన్నో ఏళ్లుగా ఇలాగే పెడుతున్నాం.. ఇప్పుడే అభ్యంతరం వచ్చిందని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి రోజున.. నందమూరి ఫ్యామిలీలో విభేధాలు బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ ఉదయం నందమూరి కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు వచ్చి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. పెద్ద ఎత్తున ఎన్టీఆర్ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ వచ్చి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులు అర్పించారు.

ఈ క్రమంలో బాలయ్య.. ఆ ఫ్లేక్సీలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తొలగించమని ఆదేశించారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్.. ఆ ఫ్లేక్సీలను తొలగించారు. వాటిని రోడ్డు మీద పడేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యారు. బాలయ్య ఇలా చేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై బాబాయ్-అబ్బాయికి మధ్య దూరం మరింత పెరిగిందని కామెంట్స్ వినిపించాయి. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్, సోషల్ మీడియా యుజర్స్ కూడా బాలయ్య చేసిన దాన్ని తప్పుబడుతున్నారు. అయితే బాలయ్య అలా చేయడానికి ఇంకో రీజన్ ఉందని తెలుస్తోంది. బాలయ్య కోప్పడింది నిజమే.. కానీ ఆ కోపానికి కారణం వేరే ఉందట. ఎన్టీఆర్ వర్ధంతి కోసం కట్టిన ఫ్లెక్సీలే బాలయ్య కోపానికి కారణం అయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొందరు అభిమానులు అత్యుత్సాహం చూపిస్తూ 'నందమూరి తారకరామారావు 28వ వర్ధంతికి విచ్చేయనున్న జూనియర్ ఎన్టీఆర్ కి స్వాగతం.. సుస్వాగతం.." అంటూ ఫ్లెక్సీ మీద రాసుకువచ్చారు. వర్ధంతికి స్వాగతం అని ఎలా వేశారో, ఎందుకు వేశారో.. తెలియదు. ఇక ఈ ఫ్లెక్సీ చూడగానే ఎవరికైనా కోపం వస్తుందని... ఈ క్రమంలోనే బాలయ్య కోప్పడ్డారని తెలుస్తోంది. ఇక ఈ విషయంపై టీడీపీ వర్గాలు ఇలా వివరణ ఇస్తున్నాయి.
మరోవైపు ఎన్నో ఏళ్లుగా వర్ధంతికి ఇలాగే వేస్తున్నాం.. ఇప్పుడే ఇలా అనడం ఏంటని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్ మధ్య రచ్చ జరుగుతోంది. బాలయ్య అలా అనడం ఏంటని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతుండగా.. అందులో తప్పు ఉందని అలా అన్నారు అని టీడీపీ ఫ్యాన్స్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











