RRR: రాజమౌళి సినిమా నుంచి ఎందుకు తప్పుకుంటున్నానంటే.. డైసీ ఎడ్గర్ జోన్స్ ఎమోషనల్‌!

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి రాజమౌళి దర్శకత్వంలోఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిత్ర యూనిట్ గుజరాత్‌లోని వడోదరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ రాంచరణ్ కు గాయం కావడంతో షూటింగ్ రద్దయింది. ఆర్ఆర్ఆర్ చిత్ర తదుపరి షూటింగ్ పూణే, ఢిల్లీ, కోల్ కతా లాంటి నగరాల్లో జరగనుంది. రాంచరణ్ కు గాయమైన కొన్ని రోజులకే చిత్ర యూనిట్ కి మరో షాక్ తగిలింది. ఈ చిత్రం నుంచి డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకున్నట్లు ఆర్ఆర్ఆర్ టీం శనివారం రోజు ప్రకటించారు. తాజాగా డైసీ ఎడ్గార్ జోన్స్ దీనిపై స్పందించింది.

బ్రిటిష్ భామ

బ్రిటిష్ భామ

డైసీ ఎడ్గార్ జోన్స్ బ్రిటిష్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ టీం నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమౌళి మాట్లాడుతూ ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గార్ జోన్స్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. దీనితో ఈ భామ ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినీ అభిమానులంతా డైసీ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

ఎమోషనల్‌గా

ఎమోషనల్‌గా

డైసీ ఎడ్గార్ జోన్స్ అనుకోని కారణాల వలన ఆర్ఆర్ఆర్ నుంచి తప్పుకుంటున్నట్లు చిత్ర యూనిట్ శనివారం రోజు ప్రకటించింది. తాను ఈ చిత్రం నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని డైసీ తాజాగా సోషల్ మీడియాలో ప్రకటించింది. డైసీ ఎడ్గార్ జోన్స్ కు ఊహించని కుటుంబ సమస్యలు ఎదురయ్యాట. అందువలనే తాను ఈ చిత్రంలో భాగం కాలేకపోతున్నానని ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

అద్భుతమైన కథ

అద్భుతమైన కథ

ఆర్ఆర్ఆర్ చిత్ర కథ అద్భుతమైనది. ఈ చిత్రం ద్వారా నాకు గొప్ప పాత్రలో నటించే అవకాశం వచ్చింది. కానీ నేను ఈ చిత్రంలో కొనసాగలేకపోతున్నాను. తన స్థానంలో ఎవరు నటించినా మంచి గుర్తింపు పొందుతారని ఆశిస్తున్నాను. చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ అంటూ డైసీ ప్రకటించింది. డైసీ తప్పుకోవడంతో ఎన్టీఆర్ కు మరో హీరోయిన్ ని వెతకాల్సి ఉంది. ఈ సారి రాజమౌళి ఎలాంటి ఫారెన్ భామని ఎంపిక చేసుకుంటాడో చూడాలి.

మొత్తానికి పూర్తి చేశాం

మొత్తానికి పూర్తి చేశాం

ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్డేట్ ని కూడా చిత్ర యూనిట్ అందించింది. రాంచరణ్ కు గాయం కావడంతో ఎదురుదెబ్బ తగిలింది. అయినా కూడా గుజరాత్ షెడ్యూల్ ని అనుకున్న సమయానికి పూర్తి చేశాం అని చిత్ర యూనిట్ ప్రకటించారు. షూటింగ్ కు సహకరించిన ధర్మాజ్, సిద్ధపూర్ పట్టణ ప్రజలకు ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. ఉగాది కోసం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చినట్లు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X