హన్సిక.. నాగచైతన్యకి 'నో' అనటానికి కారణం
హైదరాబాద్: "దురదృష్టవశాత్తు నేను తమిళ వెట్టై రీమేక్ నుంచి బయిటకు వచ్చాను. అయితే దానికి కారణం కేవలం బల్క్ డేట్స్ ఇవ్వలేకపోవటమే. వారు ఈ సంవత్సరం చివరకు ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ నా చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. అందుకే తప్పుకున్నాను..మరే వేరే కారణమేది లేదు. ఆ టీమ్ కు నా బెస్ట్ విషష్. ఇదే అసలైన రీజన్ కాబట్టి ఇక ఈ విషయమై నెట్ లో, ప్రింట్ లో వచ్చే రూమర్స్ కు ఫుల్ స్టాఫ్ పెడతారని భావిస్తున్నాను" అంటూ హన్సిక ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆ ప్రాజెక్టు నుంచి బయిటకు రావటానికి కారణం ...తను ఇచ్చిన డేట్స్ ని వినియోగించుకోకపోవటమే అని తెలుస్తోంది.
ఎందుకంటే సినిమా ఒప్పుకోకముందే డేట్స్ ఖరారు చేసుకున్నాకే ఎడ్వాన్స్ తీసుకుంటారు. అలాంటిది నెల రోజుల ముందు ఈ బల్క్ డేట్స్ విషయమా తెలియదా అనేది ఆలోచించాల్సిన విషయం. ఇక అసలు నిజం ఏమిటంటే... హన్సిక ఆగస్టు లో 10 రోజులు, సెప్టెంబర్ లో 10 రోజులు ఈ చిత్రానికి డేట్స్ కేటాయించింది. అయితే రకరకాల కారణాలతో ఆమె డేట్స్ ని వారు వాడుకోలేకపోయారు. దాంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుని ప్రాజెక్టునుంచి బయిటకు రావాల్సి వచ్చింది. ఈ విషయాన్నీ ఆమె ఓ మీడియా సంస్ధతో మాట్లాడుతూ ఖరారు చేసింది.
కొంచెం ఇష్టం కొంచెం కష్టం దర్శకుడు పి.కిశోర్‌కుమార్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన ముందుగా హన్సికను నాయికగా తీసుకున్నారు. అయితే ఇప్పుడామె స్థానంలోకి తమన్నా వచ్చారు. దానికి పెద్ద కారణాలేవీ లేవు. కేవలం హన్సిక డేట్స్ కుదరకపోవడంవల్లే ఈ మార్పు జరిగింది. జూన్, జూలై మాసాల్లో హన్సిక ఈ సినిమాకు డేట్స్ ఇచ్చారు. కానీ సినిమా ప్రారంభం విషయంలో జాప్యం జరగడంతో హన్సిక మళ్లీ డేట్స్‌ని ఎడ్జస్ట్ చేయలేకపోయారు. తెలుగుతో పాటు హన్సిక తమిళ చిత్రాల్లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఈ మార్పు జరిగింది. ఇదిలా ఉంటే '100% లవ్'తో నాగచైతన్య, తమన్నా జంట క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే తమన్నా ఇదే దర్శకుడుతో గతంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం లోనూ చేసింది.


Click it and Unblock the Notifications











