హరికృష్ణ సన్నబడటానికి అసలు కారణం

By Srikanya

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ ఈ మధ్య రీసెంట్ గా... ఓం చిత్రం పంక్షన్ లో చాలా చిక్కిపోయి సన్నపడి కనిపించారు. దానికి కారణం ఏమిటనేది చాలా మందికి అర్దం కాలేదు. అదో చర్చనీయాంసంగా మారింది. అంతా లైపో చేయించుకున్నారు అనుకున్నారు. ఈ విషయమై ఆయన కుమారుడు కళ్యాణ్ రామ్ వివరణ ఇచ్చారు.

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..లైపో ..కాదండీ... ఆయనకు షుగర్. ప్రస్తుతం ప్రొటీన్ డైట్‌లో ఉన్నారు. ఇది చాలా స్ట్రిక్ట్ డైట్. షుగర్ మొత్తాన్ని డౌన్ చేసేస్తారు. తర్వాత కంట్రోల్ చేస్తారు. కొత్తరకం ట్రీట్‌మెంట్ అనమాట. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నారు. త్వరలోనే నార్మల్‌కి వచ్చేస్తారు. ఇప్పుడాయన కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. కేవలం ప్రొటీన్సే తీసుకోవాలి. ఈ ట్రీట్‌మెంట్ తీసుకునేవారు రెండుగంటలకు ఓ సారి తినాలి. ఆకలి అనిపించకపోయినా తినాలి. అయితే... తక్కువ తినాలి అని చెప్పుకొచ్చారు.

నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంత కాలం నుంచి త్రీడి చిత్రం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై త్రీడీ స్టీరియోఫోనిక్‌ విధానంలో 'ఓం' చిత్రాన్ని తానే హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు . ఛాయాగ్రాహకుడు సునీల్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కృతి కర్బందా, నికీషా పటేల్‌ హీరోయిన్స్ .

కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ''యాక్షన్‌ ప్రధానమైన కథ, కథనాలతో చిత్రం సాగుతుంది. ఆహ్లాదకరమైన వినోదం, వినసొంపైన సంగీతం జత కూడాయి. యాక్షన్‌ అంశాలు ఎక్కువగా ఉన్న చిత్రాన్ని త్రీడీలో చూపించడం కత్తి మీద సాములాంటిదే. చిత్రీకరణ మొదలుపెట్టడానికి ఎనిమిది నెలల ముందు నుంచీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు సాగించాం. అమెరికా నుంచి నిపుణులను తీసుకొచ్చి చిత్రీకరణ చేశాం. స్టెప్‌ అప్‌3, ఫైనల్‌ డెస్టినేషన్‌, స్పైడర్‌మేన్‌4, అవతార్‌, రెసిడెంట్‌ ఈవిల్‌ లాంటి చిత్రాలకు పని చేసిన అనుభవం వాళ్లకు ఉంది. రెడ్‌ ఎపిక్‌, త్రీడీ రిగ్‌ కెమెరాలు, లెన్స్‌లు అక్కడి నుంచే వచ్చాయి.

ఈ చిత్రంలో కార్తీక్‌, సురేష్‌, రావు రమేష్‌, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ: కిరణ్‌, స్టీరియోగ్రాఫర్స్‌: డేవిడ్‌ మైక్‌టేలర్‌, మార్కస్‌, మజ జ్డోవిన్‌స్కీ; ఫైట్స్‌: విజయ్‌, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X