వెంకటేష్ తో సినిమా ఎందుకు ఆగిందంటే...క్రిష్
వెంకటేష్ హీరోగా క్రిష్ ప్లాన్ చేసిన కృష్ణం వందే జగద్గురుమ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆగిపోవటానికి కారణం క్రిష్ వివరిస్తున్నారు. ఆయన మాటల్లోనే...గమ్యం తర్వాత, నాకు వెంకటేష్..కృష్ణ వందే జగద్గురమ్ కోసం బల్క్ డేట్స్ ఇచ్చారు. అయితే నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతాను..కథ సహజంగా దానికదే రావాలి. అదే పంధాలో కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికి క్లైమాక్స్ మినహా మొత్తం రాసాను. అయితే ఎన్ని రోజులున్నా మేము అనుకున్నట్లుగా కంక్లూజన్ షేప్ అప్ కావటం లేదు. దాంతో నాకు ఆ వర్క్ లో వంద శాతం నిజాయితీ లేదనిపించింది. ఆ కథ కోసం నేను ఎనిమిది నెలలు పనిచేసాను. వెంకటేష్..ఆరు నెలలు ఆ స్క్రిప్టు కోసం వెయిట్ చేసారు. దాంతో జనవరి 2009 న నేను వెంకటేష్ ని కలిసి నేను ఆ కథని కంప్లీట్ చేయలేకపోతున్నట్లు చెప్పాను. అలా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అప్పుడు వేదం మెటిరియలైజ్ చేసాను అని క్రిష్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











