»   » మహేష్ బాబు ముంబై వెళ్లింది అందుకే, రహస్యంగా అతన్ని కలిశాడట!

మహేష్ బాబు ముంబై వెళ్లింది అందుకే, రహస్యంగా అతన్ని కలిశాడట!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్‌కు వెళుతున్నారా?.... అంటూ రెండు మూడు రోజులుగా వార్తకథనాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ముంబై వెళ్లిన మహేష్ పలువురు టాప్ బాలీవుడ్ డైరెక్టర్లను కలిశారంటూ ప్రచారం జరిగింది. వాస్తవం ఏమిటంటే.... మహేష్ బాబు ఏ దర్శకుడినీ కలవలేదు, ఆయనకు అసలు బాలీవుడ్లో అడుగు పెట్టాలనే ఆలోచన కూడా లేదు. ఈ విషయాన్ని గతంలో అనేక సందర్భాల్లో ఆయన స్పష్టం చేశారు. మరి అలాంటి ఉద్దేశ్యం లేనపుడు మహేష్ బాబు ముంబై ఎందుకు వెళ్లినట్లు? అని డౌట్ పడేవారికి సమాధానం దొరికింది. హకీమ్ ఆలీమ్ అనే వ్యక్తిని కలిసేందుకు ఆయన వెళ్లారట.

  ఎవరీ హకీమ్ ఆలిమ్

  ఎవరీ హకీమ్ ఆలిమ్

  హకీమ్ ఆలిమ్ అనే వ్యక్తి బాలీవుడ్ పాపులర్ హెయిర్ స్టైలిస్ట్. ముంబై, హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా హకీమ్ అలీమ్ సెలూన్ చైన్ ఉంది. ఇతడిని కలిసేందుకే మహేష్ బాబు ముంబై వెళ్లారు మన సూపర్ స్టార్.

   న్యూ లుక్ కోసమే

  న్యూ లుక్ కోసమే

  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోయే 25వ సినిమాలో మహేష్ బాబు న్యూ లుక్‌తో కనిపించబోతున్నారు. అందుకే ఆయన కొన్ని రోజులుగా జుట్టుతో పాటు గడ్డం పెంచాడు. కొత్త లుక్ గురించి చర్చించేందుకు, లుక్ టెస్టింగ్ కోసం మహేష్ బాబు అక్కడికి వెళ్లారట.

  త్వరలో హైదరాబాద్ రానున్న హకీమ్ ఆలిమ్

  త్వరలో హైదరాబాద్ రానున్న హకీమ్ ఆలిమ్

  మహేష్-వంశీ పైడిపల్లి సినిమా ప్రారంభానికి కొన్ని రోజుల ముందు హకీమ్ ఆలిమ్ హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబును మేకోవర్ చేస్తారని తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది.

  త్వరలో షూటింగ్ ప్రారంభం

  త్వరలో షూటింగ్ ప్రారంభం

  25వ సినిమా కావడంతో మహేష్ బాబు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వ్యవసాయం, రైతులు నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుదని, అల్లరి నరేష్‌ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

  English summary
  A couple of days ago, with Superstar Mahesh getting down in Mumbai and staying a day there, a buzz has come out that he's in talks for a Bollywood movie. This news is Totally wrong. Mahesh to get down in Mumbai is to meet Hakim Aalim, the celebrity stylist who is quite popular in the Bollywood circuits, for his 25th film that is being directed by Vamsi Paidipally.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more