భాస్కర్ పై నాగబాబు కామెంట్స్ వెనక మరో స్టోరీ ఉందా?
ఆరెంజ్ దర్శకుడు భాస్కర్ ని 'మిరపకాయ్' చిత్రం స్టేజిపై దులిపిపారేస్తూ కామెంట్స్ చేసిన నాగబాబు అంతటా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అలాగే ఆ తర్వాత జెనీలియా తమను ఇబ్బంది పెట్టి ఎక్కువ డబ్బు వసూలు చేసిందని అన్నారు. అయితే ఇలా నాగబాబు దర్శకుడు,హీరోయిన్ పై విరుచుకు పడటం వెనక ఓ స్ట్రాటజీ ఉందని సినీ వర్గాల్లో వినపడుతోంది. ఆరెంజ్ ప్లాపుతో దెబ్బ తిన్న డిస్ట్రిబ్యూటర్స్ పరిహారం ఇవ్వాలని కోరకుండా ఇలా ముందే తాను చాలా నష్టపోయినట్లు మాట్లాడితే సమస్య ఈజీగా సాల్వ్ అవుతుందనే ఈ విధమైన కామెంట్స్ బహిరంగంగా చేసాడని చెప్పుకుంటున్నారు.
అయితే నిజంగా నాగబాబు ..బడ్జెట్ పెరగటం, డెఫిషిట్ రావటంపై ఆవేదన చెందాడని,కాని ఇలా బయిటపడటానకి కారణం మాత్రం భవిష్యత్ లో కొత్త తలనొప్పులు రాకుండా ఉండటానికే అంటున్నారు. మరో ప్రక్క తమ రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఆరెంజ్ ఫెయిల్యూర్ ని దృష్టిలో పెట్టుకుని పంపిణీదారులను రెచ్చగొట్టే సమస్య ఉందని ఊహించే ఇలా బహిరంగ ఆరోపణలకు దిగాడని చెప్తున్నారు.
ఇక నాగబాబు.. 'మిరపకాయ్' పంక్షన్ లో ''నిర్మాత అనేవాడు లేకపోతే చిత్ర పరిశ్రమ సర్వ నాశనమైపోతుంది. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఉండేదట అని చరిత్రలో మనం చదువుకోవాల్సిన దుస్థితి వస్తుంది. నిర్మాత డబ్బు పెడుతుంటే... ఎన్నిరోజుల్లో సినిమా తియ్యాలి? అనే ఇంగిత జ్ఞానం కూడా లేని దర్శకులున్నారు అంటూ మండిపడ్డారు. అలాగే దర్సకులు శరీరంలోకి చేరే వైరస్‌లా తయారయ్యారు. కొన్నాళ్లకు శరీరాన్ని తినేస్తుంది. దయచేసి నిర్మాతను బతకనియ్యండి. ఎంతో మంది నిర్మాతలు పరిశ్రమ నుంచి వెళ్లిపోతున్నారు. మన తెలుగు ఖ్యాతిని పెంచిన రామ్‌గోపాల్ వర్మను ఆదర్శంగా తీసుకొని పనిచెయ్యండని ఆవేశంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











