హరీష్ శంకర్‌పై నాని ఫ్యాన్స్ ట్రోలింగ్... ఇది అన్యాయం అంటున్న జనం!
నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'గ్యాంగ్ లీడర్' చిత్రం ఆగస్టు 30న విడుదలవ్వాల్సి ఉండగా... 'సాహో' ఎఫెక్టుతో విడుదల వాయిదాపడిన సంగతి తెలిసిందే. దీన్ని సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తేవాలని మూడు రోజుల క్రితం డిసైడ్ అయ్యారు నిర్మాతలు.
మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'వాల్మీకి' మూవీ సైతం చాలా రోజుల క్రితమే సెప్టెంబర్ 13న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. 'గ్యాంగ్ లీడర్' కూడా అదే రోజున విడుదలవుతుండటంతో హరీష్ శంకర్ విష్ చేశారు.
మనస్ఫూర్తిగా విష్ చేసిన హరీష్ శంకర్
వావ్... సెప్టెంబర్ 13 మూవీ లవర్స్‌కు పండగరోజే. వాల్మీకి, గ్యాంగ్ లీడర్ రెండు సినిమాలు ఒకరోజున రావడం ఆనందంగా ఉంది. వాల్మీకి టీమ్ తరుపున గ్యాంగ్ లీడర్ చిత్ర బృందానికి మనస్పూర్తిగా విషెస్ తెలియజేస్తున్నట్లు హరీషీ శంకర్ ట్వీట్ చేశారు.
నాని రియాక్షన్
హరీష్ శంకర్ ట్వీటుపై నాని రియాక్ట్ అయ్యారు. ‘థాంక్యూ బ్రదర్... మీ వాల్మీకి మూవీ కూడా మంచి విజయం అందుకోవాలి, వరుణ్‌కు, మీకు నా శుభాకాంక్షలు. సెప్టెంబర్ 13 తెలుగు ప్రేక్షకులకు గ్రేట్ వీకెండ్ కావాలి... అంటూ ట్వీట్ చేశారు.
ఓ అభిమాని ఇలా...
ఆపండి మీరు మీ డప్పులు.. ఒకరి డప్పు మరొకరు కొట్టుకుని జనాల్ని పిచ్చి వాళ్లని చెయ్యొద్దు. జనాలకి తెలుసు వాళ్లు డిసైడ్ చేస్తారు పండుగనా దండగనా అని..... అంటూ ఓ సినీ అభిమాని వ్యాఖ్యానించడం గమనార్హం.

కొందరు నాని ఫ్యాన్స్ ఇలా కామెంట్ చేశారేంటి?
అయితే కొందరు నాని ఫ్యాన్స్ హరీష్ శంకర్ చేసిన ట్వీటుపై స్పందించిన తీరు చర్చనీయాంశం అయింది. హరీష్ భయ్యా... మీరు అనవసరంగా నాని సినిమాతో క్లాష్ పెట్టుకున్నారు. పక్కకు తప్పుకుంటే మంచిది అంటూ కామెంట్స్ పెట్టారు. వాస్తవానికి ‘గ్యాంగ్ లీడర్' కంటే ముందే ‘వాల్మీకి' రిలీజ్ డేట్ సెప్టెంబర్ 13కు ఫిక్స్ అయింది. ఇప్పుడు వచ్చి నాని ఫ్యాన్స్ ఈ విధంగా ట్రోల్ చేయడం అన్ ఫెయిర్, అన్యాయం అనే వాదన వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











