For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బీరు కొన్న నయనతార ..అసలు నిజం ఇదీ

  By Srikanya
  |

  హైదరాబాద్: నయనతార చెన్నైలోని ఓ వైన్ షాప్ లో బీరు కొంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది అంటూ ఓ వీడియో మీడియోలో హైలెట్ అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఎక్కడనుంచో వచ్చి బీరు కొంటున్న నయనతార ని వీడియో తీసి యూ ట్యూబ్ లో పెట్టారంటూ దుమారం రేగింది. హీరోయిన్ ఇలా బహిరంగంగా బీరు కొనుక్కుని తాగటం ఏమిటీ...అంటూ విమర్శలు వినిపించాయి. ఆ వీడియో ని చూస్తే నిజంగా నే ఆమె కొనుక్కోవటం కనిపించింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  అయితే అసలు నిజం....

  వేరుని తెలిసింది. ఆమె తమిళంలో నటిస్తున్న నానుం రౌడీదా చిత్రం కోసం తీసిన సీన్ అది అని తేలింది. సినిమాలోని ఈ సీన్ ని కావాలని లీక్ చేసారో..మరేమో కాని ఇప్పుడు ఈ సీన్ తమిళ,తెలుగు లో హాట్ టాపిగా మారింది. విజయ్ సేతుపతి, నయనతార నటిస్తున్న చిత్రం ఇది. పోడా పొడి ఫేమ్ విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ధనుష్ స్వయంగా తన బ్యానర్ లో నిర్మిస్తున్నారు.

  Reason behind Nayantara's wine shop visit

  కాలానికి తగ్గట్టు తమను తాము మలచుకోకపోతే.. రాణించడం సాధ్యం కాదని నయనతార కి తెలిసినట్లు మరొకరకి తెలియదేమో. అందుకే అగ్రహీరోలతో ఆడిపాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. కుర్ర హీరోలతోనూ జతకడుతోంది నయన్‌. బాలకృష్ణ-ఎన్టీఆర్‌, వెంకటేష్‌- రాణా.. వంటి బాబాయ్‌- అబ్బాయిలతో జోడీ కట్టిందీ ముద్దుగుమ్మ. రజనీకాంత్‌, ధనుష్‌ల సరసన కూడా ఆడిపాడింది. నయన్‌కి పోటీగా ఎందరొచ్చినా.. ఇప్పటికీ ఆమె క్రేజీ మాత్రం కోలీవుడ్‌లో తగ్గలేదనే చెప్పాలి.

  ఇటీవల నటుడు జై సరసన ఆడిపాడి అందర్నీ ఆకట్టుకుంది. త్వరలో విజయాల వీరుడు విజయసేతుపతితో కూడా కలిసి నటించనుంది. ధనుష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'నానుం రౌడీ దాన్‌' (నేనూ రౌడీనే) అని టైటిల్‌ పెట్టారు. అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో 'సూదుకవ్వుం' స్టెల్‌లో ఇక్కడ ఎవర్ని కిడ్నాప్‌ చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. అందుకు 'నయనతార' అని సమాధానమిచ్చారు విజయ్‌ సేతుపతి.

  'నయన్‌ అంటే ఎంత ఇష్టమని' ప్రశ్నించగా.. తెగ సిగ్గుపడిపోయి సమాధానం కూడా చెప్పకుండా దాటవేశారు విజయ్‌. ఈ కార్యక్రమానికి అదో పెద్ద హైలెట్‌గా మారింది. ఇప్పుడు ఏకంగా విజయ్‌ సేతుపతి కల నెరవేరింది. ఈ విషయాన్ని ధనుష్‌ తన ట్విట్టర్‌లో ప్రస్తావించగా.. అందుకు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. వారిలో ఓ వ్యక్తి.. 'కొక్కి కుమార్‌' నిర్మించగా 'సుమారు మూంజి కుమారు' నటిస్తున్నారని చేసిన పోస్టును.. ధనుష్‌ రీట్వీట్‌ చేయడం విశేషం.

  English summary
  There was a certain video of Nayantara buying beer from a local wine shop doing the rounds on many online portals. The fact is that the video is apparently a shot from the Nayantara-Vijay Sethupathi starrer 'Naanum Rowdydhaan' 'NDR' is being directed by 'Poda Podi' fame Vignesh Shivan and produced by Dhanush under the Wunderbar Films banner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X