నేల టిక్కెట్టు ఆడియో లాంచ్‌కు పవన్ చీఫ్ గెస్ట్.. అసలు కారణం అదే అంటూ రూమర్స్!
Recommended Video

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయ కార్యక్రమాలతో బిజీ అయిపోయారు. అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ మరో చిత్రం చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాదే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల పవన్ కొన్ని సినిమా ఈవెంట్స్ హాజరవుతూ అభిమానులని ఖుషి చేస్తున్నారు. రంగస్థలం చిత్ర సక్సెస్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్, రాంచరణ్ కలయిక మెగా అభిమానులని ఆకట్టుకుంది. తాజాగా పవన్ కళ్యాణ్ మరో సినిమా ఈవెంట్ లో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు. రవితేజ నటించిన నేల టిక్కెట్టు ఆడియో లాంచ్ కు పవన్ ముఖ్య అతిధిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే. దీని గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

ఖరారు చేసిన దర్శకుడు
కొన్ని వారాల నుంచి పవన్ కళ్యాణ్ నేల టికెట్టు ఆడియో లాంచ్ కు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఆ అలవాటు పవన్‌కు లేదు
పవన్ కళ్యాణ్ కళ్యాణ్ సినిమా ఈవెంట్స్ కు వెళ్లడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. సినిమా ఫంక్షన్స్ కు పవన్ దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ రాజకీయల్లోకి వచ్చాక పవన్ కొన్ని ఈవెంట్స్ కు హాజరవుతున్నారు.

నిర్మాత కోసమేనా
నేల టికెట్టు ఆడియో ఈవెంట్ కు హాజరు కావాలని చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి పవన్ ని రిక్వస్ట్ చేశారట. ఆయన ఆహ్వానం మేరకే పవన్ ఆడియో వేడుకకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ కోణం
ఇందులో రాజకీయ కోణం కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రామ్ తాళ్లూరి ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన జనసేన పార్టీకి ఆర్థికంగా సాయం చేస్తున్నారనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. భవిషత్తులో రామ్ తాళ్లూరి జనసేన పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసే అవకాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలో ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారో చూద్దాం!

ఆడియో వేదిక అక్కడే
ఈ నెల 10 న హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో నేల టికెట్టు ఆడియో వేడుక జరగనుంది. అటు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇటు రవితేజ అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











