అమెరికాలో ప్రభాస్ ఏం చేస్తున్నాడు?: ఎందుకు వెళ్లాడో తెలుసా..
బాహుబలితో రీజినల్ స్టార్ స్థాయి నుంచి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ప్రతీ కదలికపై మీడియా ఫోకస్ ఎక్కువైందనే చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి ఓ ఆసక్తికర వార్త తెర పైకి వచ్చింది. అదేంటంటే.. ప్రభాస్ ఈమధ్యే అమెరికా వెళ్లాడట. ఎందుకు అని ఆరా తీస్తే తెలిసిందేంటంటే..
Recommended Video


ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసిన ప్రభాస్:
బాహుబలి తర్వాత సాహోలో నటిస్తున్న ప్రభాస్.. ఈ సినిమా కోసం తన ఆహార్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాహుబలి తర్వాత బరువు తగ్గడానికి చాలానే కష్టపడ్డ ప్రభాస్.. ఫిట్‌నెస్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన అమెరికా వెళ్లాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

అమెరికా టూర్ ఎందుకు?:
బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్ భుజానికి అమెరికాలో శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సాహో కోసం మరోసారి ఫిట్‌నెస్ కసరత్తులు మొదలుపెట్టడంతో.. ముందు జాగ్రత్తగా అక్కడి వైద్యులను సంప్రదించారట. ఎటువంటి జాగ్రత్తలతో ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకోవాలని వారిని అడిగి తెలుసుకుంటున్నాడట.

వైద్య పరీక్షల కోసం..:
ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న ప్రభాస్.. తన ఫిట్‌నెస్ లో కొన్ని మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచనలు, సలహాల మేరకు అవసరమైన వైద్య పరీక్షలు కూడా చేయించకుంటున్నాడని టాక్. కాగా, అమెరికా నుంచి రాగానే నేరుగా సాహో చిత్ర షూటింగ్‌కు వెళ్లనున్నాడు ప్రభాస్.

రాగానే.. దుబాయ్ షెడ్యూల్:
ఇటీవల 'సాహో' దుబాయ్ షెడ్యూల్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అక్కడి అధికారులు అనుమతులు నిరాకరించడంతో టీమ్ తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి అన్ని అనుమతులు పొంది దుబాయ్‌లో షూటింగ్ చేసేందుకు సాహో టీమ్ సిద్దమైపోయింది. ప్రభాస్ అమెరికా నుంచి రావడమే ఆలస్యం.. చిత్ర యూనిట్ దుబాయ్ ఫ్లైట్ ఎక్కేయనుంది.


Click it and Unblock the Notifications











