బెడిసి కొట్టిన వ్యూహం.. ఆర్జీవి శపథం విఫలం.. సినిమాలు రిలీజ్ వాయిదా వెనుక కారణం ఇదే..
రామదూత క్రియేషన్ బ్యానర్, ఆర్జీవి డెన్ సమర్పణలో రూపొందిన వ్యూహం సినిమా మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఫిబ్రవరి 23వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే రిలీజ్‌కు ఒకరోజు ముందు ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు నిర్మాత దాసరి కిరణ్, అలాగే దర్శకుడు రాంగోపాల్ వర్మ తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదాకు కారణాల్లోకి వెళితే..
వ్యూహం సినిమాను గతేడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే అందులోని క్యారెక్టర్లు మా మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ కోర్టులో కేసు వేయడంతో సినిమాను వాయిదా వేశారు. అలాగే సెన్సార్ సర్టిఫికెట్ క్లియరెన్స్ లేకపోవడం కూడా వాయిదాకు గురైంది. అయితే సెన్సార్, కోర్టు కేసుల నుంచి విముక్తి పొందిన అనంతరం ఈ సినిమాను రిలీజ్ డేట్లను రాంగోపాల్ వర్మ ఓ అమ్మాయితో పబ్‌లో ఎంజాయ్ చేస్తూ ట్వీట్లు చేయడం ద్వారా ప్రకటించారు.

అయితే గత కొద్దికాలంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 23న కాకుండా వ్యూహం మూవీని మార్చి 1వ తేదీన రిలీజ్, అలాగే రెండోపార్టు శపథం చిత్రాన్ని మార్చి 8 తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
వ్యూహం సినిమా రిలీజ్ డేట్లను ప్రకటిస్తూ.. ఆ ఆర్జీవి గాడికి తిక్కాలేదు.. లెక్కా లేదు అంటూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. మార్చి 1వ తేదీన వ్యూహం, మార్చి 8వ తేదీన శపథం సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ట్వీట్‌లో ప్రకటించారు.
ఇదిలా ఉండగా, వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ వాయిదా పడటానికి ప్రధాన కారణం సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉండటమే అని సినీ వర్గాలు, చిత్ర యూనిట్ పేర్కొన్నారు. అయితే ఎలాంటి సమస్యల ఆగిపోయిందనే విషయాన్ని చెప్పడానికి నిరాకరించారు.


Click it and Unblock the Notifications











