twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియా చక్రవర్తికు బెయిల్ వెనుక అసలు కథ ఇదే‌.. తెరపైకి కొత్త ట్విస్టు

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి ఊహించని విధంగా బెయిల్ లభించింది. సుశాంత్‌కు సంబంధించి డ్రగ్స్, ఆర్థిక వ్యవహారాల్లో అవకతకలపై రియాను సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పలుమార్లు కోర్టులు బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన తర్వాత తాజాగా బాంబే హైకోర్టు జైలు నుంచి విడుదలకు సానుకూలంగా స్పందించింది. రియాకు బెయిల్ లభించడానికి ప్రధాన కారణాలు ఇవే అంటూ న్యాయమూర్తి వెల్లడించిన విషయాలు..

    రియా చక్రవర్తిపై ప్రధాన ఆరోపణలు

    రియా చక్రవర్తిపై ప్రధాన ఆరోపణలు

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్స్ సమకూర్చారనే ప్రధాన ఆరోపణల రియా చక్రవర్తిపై వచ్చింది. డ్రగ్స్ కోసం ఆమె డబ్బు ఖర్చు చేసింది. నిషేధిత మాదక ద్రవ్యాల కోసం డబ్బు సమకూర్చింది అనే ఆరోపణలపై ఆమెను అరెస్ట్ చేశారు. అయితే డ్రగ్స్ సమకూర్చింది తన కోసం కాదు.. ఇతరుల కోసమని ఆమె తరఫున న్యాయవాది సతీష్ మాన్‌షిండే తన వాదనలు వినిపించారు.

    ఎన్సీబీ అధికారులు వాదన

    ఎన్సీబీ అధికారులు వాదన

    డ్రగ్స్ కేసులో రియాపై కేసు నమోదు చేస్తూ తన క్రెడిట్ కార్డును ఉపయోగించి శ్యామ్యూల్ మిరాండా ద్వారా 5 గ్రాముల డ్రగ్స్ కోసం రూ.10 వేలు ఖర్చు చేశారు అని ఎన్సీబీ అధికారులు పేర్కొన్నారు. అయితే రియా తరఫు న్యాయవాది సతీష్ మాన్‌షిండే తన వాదనలు వినిపిస్తూ.. డ్రగ్స్ కోసం ఆ డబ్బును రియా నేరుగా చెల్లించలేదు అని అన్నారు.

    హైకోర్టు న్యాయమూర్తి తీర్పులో

    హైకోర్టు న్యాయమూర్తి తీర్పులో

    రియా బెయిల్ పిటిషన్‌పై ఇరువర్గాల వాదోపవాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జస్టిస్ కోత్వాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా వ్యవహారం గానీ, వ్యవహారాల కోసం గానీ డబ్బులను సమకూర్చడం ఆ వ్యవహారం కోసం ఫైనాన్స్ చేసినట్టు భావించరాదు. ఓ ప్రత్యేకమైన వ్యవహారం జరిపేటప్పుడు ఆ వ్యవహారానికి డబ్బు సమకూర్చడాన్ని ఫైనాన్స్‌ కిందకు వస్తుందనే విషయాన్ని విశదీకరించాలి. సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసే విషయంలో రియా చక్రవర్తి డబ్బు ఖర్చు చేయడం ఫైనాన్స్ కిందకు రాదు అనే అభిప్రాయాన్ని న్యాయమూర్తి తెలిపారు.

    ఇతరుల కోసం డబ్బు ఖర్చు చేస్తే

    ఇతరుల కోసం డబ్బు ఖర్చు చేస్తే

    రియా బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా న్యాయమూర్తి తన వాదనన వ్యక్తం చేస్తూ.. ఎన్డీపీఎస్ చట్టం సెక్షన్ ప్రకారం.. నిషేదిత డ్రగ్స్ వినియోగించడం శిక్ష కిందకే వస్తుందనే విషయాన్ని నేను అంగీకరిస్తాను. కానీ ఇతరుల డ్రగ్స్ వినియోగం కోసం డబ్బు ఖర్చు చేస్తే అది ఫైనాన్స్ చేయడం కిందకు రాదని భావిస్తాను అని న్యాయమూర్తి కోత్వాల్ అన్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    1 లక్ష బాండ్ కోసం ఒక నెల గడువు

    1 లక్ష బాండ్ కోసం ఒక నెల గడువు


    డ్రగ్స్ కేసులో లాయర్ సతీష్ మాన్‌షిండే వాదనలకు సానుకూలంగా న్యాయమూర్తి స్పందించి రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ బెయిల్ కోసం రూ.1 లక్ష బాండ్‌ను సమర్పించాల్సిందని కోర్టు ఆదేశించారు. అయితే లక్ష రూపాయల బాండ్‌ను దాఖలు చేయడానికి నెల రోజలు సమయం ఇవ్వాలని కోర్టును లాయర్ సతీష్ మాన్‌షిండే అభ్యర్థించారు.

    English summary
    Bombay High court granted bail to Rhea Chakraborty in Bollywood drug rocket case: Actress Rhea chakraborty's lawyer Satish Maneshinde alleges NCB that, My client Rhea has not committed any crime, NCB officials has been falsely implicated in the case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X