Sreeleela విజయ్ దేవరకొండ మూవీ నుంచి శ్రీలీలను తప్పించారా? తప్పుకొన్నాదా? అసలు కారణం ఇదే!

తెలుగు సినిమా పరిశ్రమలో అతి కొద్దికాలంలో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న హీరోయిన్ శ్రీలీల. పెళ్లిసందD మూవీతో తెలుగులో కెరీర్ ప్రారంభించిన ఈ అందాల భామ వరుస చిత్రాలతో ట్రెండిగా మారారు. అగ్రహీరోలు, యువ హీరోలతో జతకడుతూ అత్యధిక పారితోషికం తీసుకొంటున్న హీరోయిన్ల జాబితాలో చేరారు. అయితే శ్రీలీలకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. ఆమెను ఓ యువ హీరో సినిమా నుంచి తొలగించి.. మరో హీరోయిన్‌ను తీసుకొన్నారనే విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ విషయంలోకి వెళితే..

శ్రీలీల కెరీర్ విషయానికి వస్తే.. పెళ్లి సందD తర్వాత మాస్ మహారాజా రవితేజతో ఆమె నటించిన ధమాకా చిత్రంతో 100 కోట్ల వసూళ్లను సాధించింది. ఆ తర్వాత భగవంత్ కేసరి సినిమాతో సోలో ఫెర్ఫార్మెన్స్‌తో కమర్షియల్ హిట్‌ను సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత కొన్ని సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి. తాజాగా గుంటూరు కారం సినిమా కూడా భారీ వసూళ్లను సాధిస్తున్నది.

Reason Behind Sreeleela dropped from Vjay Deverakondas VD12 Movie? Here is the Reasons

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించే ఓ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ఆమెను ఈ ప్రాజెక్టు నుంచి తొలగించి మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారనే విషయం వైరల్ అయింది. ఆమె స్థానంలో యానిమల్ హీరోయిన్ తృప్తి డిమ్రీ గానీ, లేదా వసంత్ రుక్మిణిని తీసుకోవచ్చని చెబుతున్నారు.

అయితే శ్రీలీల నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి. అందుకే ఆమెను తీసుకోలేదనే వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది. శ్రీలీల గతేడాది మంచి సినిమాలు చేసింది. అయితే మీడియాలో వస్తున్న రూమర్లలో నిజం లేదు. అలాంటి వార్తలను ఖండిస్తున్నాం అని చిత్ర యూనిట్ తెలిపారు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ పాత్ర స్పై క్యారెక్టర్. ఆ పాత్రకు ముందుగా శ్రీలీల తీసుకోవాలని అనుకొన్నాం. కానీ క్యారెక్టర్ పరంగా పెద్దగా గ్లామర్ అవసరం లేదు. శ్రీలీల గ్లామర్ హీరోయిన్. దాంతో ఆ క్యారెక్టర్‌ను ఆమె గ్లామర్ డామినేట్ చేస్తుందేమోననే కారణంతో ఆమె స్థానంలో మరొకరిని తీసుకోవాలని అనుకొంటున్నాం అని యూనిట్ వర్గాల తెలిపాయి.

Reason Behind Sreeleela dropped from Vjay Deverakondas VD12 Movie? Here is the Reasons

విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కొందరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇంకా ఎవరిని కన్ఫార్మ్ చేయలేదు. త్వరలోనే హీరోయిన్ ఎంపిక గురించి క్లారిటీ ఇస్తాం. అప్పటి వరకు ఎలాంటి రూమర్లను నమ్మవద్దు అని యూనిట్ వర్గాలు తెలిపాయి. దాంతో శ్రీలీలను తీసుకోకపోవడం వెనుక అసలు కారణం ఇదే అని క్లారిటీ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X