twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాపం తమన్నాని రాజమౌళి నిర్దాక్షణ్యంగా కత్తిరించిపారేశాడు : కారణం ఇదేనట

    తమన్నాను యాడ్ చేసే గ్రాఫిక్స్ వేరే కంపెనీ చేసింది. అయితే వాటిలో గ్రాఫిక్స్ బాలేదట. అందుకే రాజమౌళి నిర్దాక్షణ్యంగా ఆ పార్టును కత్తిరించిపాడేశాడు. దెబ్బకి తమన్నా సీన్స్ అన్నీ దాదాపు లేచిపోయాయ్.

    |

    బాహుబలి ద బిగినింగ్ లో అవంతిక గా కనిపించిన తమన్నాని చూసి... అద్బుతమైన పాత్ర దొరికింది ఇక తమన్నా ఫేట్ మారినట్టే ఇక దూసుకు పోతుందీ అనుకున్నారు.కానీ బాహుబలి సినిమా ఆమె కెరీర్‌నే మార్చేసింది. అవంతిక పాత్ర ప్రేక్షకులలో గిలిగింతలు పెట్టించింది. గ్లామర్ డాల్ గా కనిపించే తమన్నా ఈ సారి మాత్రం అద్బుతమైన పెర్ఫార్మెన్స్ కనబరిచి విమర్శకులనుంచీ, ప్రేక్షకులనుంచీ మెప్పుని పొందింది... కానీ పార్ట్ 2 లో అసలు కనిపించలేదు. దాంటో కావాలనే తీసేసారా అంటూ రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు దానికి సమాదానం దొరికింది...

     గొప్ప నటన

    గొప్ప నటన

    చిత్ర దర్శకుడు రాజమౌళి, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అవంతిక పాత్రను తీర్చిదిద్దిన వైనం వారికే ఆశ్చర్యం కలిగించేంత గొప్ప నటనను ఆమె నుంచి రాబట్టింది. ఫస్ట్ పార్ట్ లో చాలా ఇంపార్టెన్స్ తెచ్చుకుంది. తన ఇంట్రడక్షన్, ప్రభాస్ తో డ్యూయెట్ అబ్బో ఓ రేంజ్ లో కిక్ ఇచ్చాయి.

    మిలియన్ వ్యూస్ రికార్డు

    మిలియన్ వ్యూస్ రికార్డు

    ముఖ్యంగా పచ్చబోట్టేసిన సాంగ్ లో తమన్నా ఆరబోసిన అందాల కోసమే ఆ వీడియో సాంగ్ మిలియన్ వ్యూస్ రికార్డు సృష్టించడమే కాక తెలుగలో ఎక్కువ వీక్షించిన వీడియోగా సంచలనం సృష్టించింది. భల్లాల దేవా మీద కోపం తో ఊగిపోయే తిరుగుబాటు దళంలో సభ్యురాలిగా మంచి టెంపో కూడా చూపించింది.

    మంచి నటన ప్రదర్శించింది

    మంచి నటన ప్రదర్శించింది

    బాహుబలి తొలి భాగంలో ఊహించనంత మంచి నటన ప్రదర్శించింది అవంతికే అంటూ విజయంద్ర ప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించాడంటే ఆ చిత్రంలో ఆమె పాత్ర ధీరత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఆ నేపథ్యంలో రెండవ భాగంలో అవంతిక పాత్రను గురించి తమన్నా కూడా ఎక్కువగానే చెప్పింది..

    బాహుబలి 2 లో

    బాహుబలి 2 లో

    ఈ సినిమాలో తన పాత్రకి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని మొదటి భాగంలో మాదిరిగానే రెండవ భాగంలోను అవంతిక పాత్ర చురుకుగా .. పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పింది. తనపై యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా వుంటాయని చెప్పింది. అంటే 'బాహుబలి 2'లో పోరాటాలు చేసే కొత్త తమన్నాను చూడబోతారని చెప్పేసింది.

    అన్యాయం జరిగింది

    అన్యాయం జరిగింది

    దాంతో బాహుబలి పార్ట్ 2 లో కూడా తమన్నా పాత్ర మరెంత ఉంటుందో అని ఊహించారు కానీ అటు తమన్నాకీ ఇటు ప్రేక్షకులకీ ఒకే సారి షాక్ ఇచ్చాడు రాజమౌళి. పార్ట్ 2 లో మొదటి భాగంలో ఉన్న వారందరూ కూడా ఉన్నారు. కాని ఒకే ఒక్క పాత్రకు మాత్రం అన్యాయం జరిగింది. తనే అవంతిక.

    అలా కనిపించి ఇలా మాయం

    అలా కనిపించి ఇలా మాయం

    బాహుబలి 2 లో ఎక్కడ కనిపించకుండా కేవలం క్లైమాక్స్ జస్ట్ అలా కనిపించి ఇలా మాయం అవుతుంది. అసలు ఈ సినిమాలో అవంతిక కి ఏమైందో ఎవ్వ‌రికీ తెలీదు. ఒక జూనియ‌ర్ ఆర్టిస్ట్ లా బ్యాగ్ గ్రౌండ్ కి ప‌రిమిత‌మైపోయింది. ఒక్క‌టంటే ఒక్క డైలాగు కూడా లేదు.

    ఒక క్లోజ‌ప్ షాట్ లో మాత్ర‌మే

    ఒక క్లోజ‌ప్ షాట్ లో మాత్ర‌మే

    క‌నిపించిన ఆ కొద్ది స‌న్నివేశాల్లోనూ ఆమె గ్లామ‌ర‌స్ గా లేదు. ఒక పిచ్చి డ్రెస్ వేసుకుని... ఒక పైట్ లో ఒక క్లోజ‌ప్ షాట్ లో మాత్ర‌మే క‌నిపించింది. ఇది మిల్కీ ఫాన్స్ ని బాగా నిరాశ పరిచింది. తన పాత్ర లేదు కాబట్టే తమన్నా సైతం బాహుబలి 2 ప్రమోషన్ లో అంత యాక్టివ్ గా పాల్గొనలేదు.

    అసలెందుకు తమన్నాని అంతగా తగ్గించారు

    అసలెందుకు తమన్నాని అంతగా తగ్గించారు

    ఇంతకీ అసలెందుకు తమన్నాని అంతగా తగ్గించారు అంటే... దానికి ఒక కారణం ఉందట. వాస్తవానికి ప్రభాస్ అండ్ రానా తాలూకు వార్ సీన్లు ఒక కంపెనీ చేయగా.. మధ్యలో తమన్నా పోరాటాలు వాటిలో ఇరికించి యాడ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే హీరో అండ్ విలన్ సీన్లు ముందే తీసేశారు.

     గ్రాఫిక్స్ బాలేదట

    గ్రాఫిక్స్ బాలేదట

    తమన్నాను యాడ్ చేసే గ్రాఫిక్స్ వేరే కంపెనీ చేసింది. కాకపోతే యాడ్ చేసిన సీన్లను చూస్తే.. వాటిలో గ్రాఫిక్స్ బాలేదట. అందుకే రాజమౌళి నిర్దాక్షణ్యంగా ఆ పార్టును కత్తిరించిపాడేశాడు. దెబ్బకి తమన్నా సీన్స్ అన్నీ దాదాపు లేచిపోయాయ్. ఇప్పుడు తమన్నా పాత్ర కోసం చూస్తే.. తన సినిమా ఔట్పుట్ కు బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి తమన్నా పాత్ర పోయినా పర్లేదు కాని.. ఆడియన్స్ ఎక్కడా కూడా విజువల్ ఫీల్ ను మిస్సవ్వకుండా చూసుకున్నాడు జక్కన్న. తప్పులేదు.

    English summary
    Reason Behind Tamanna Decrease Tamanna Screen Space In Baahubali 2
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X