బంద్ ఆగకపోవటానికి అసలు కారణం వాళ్ళే
చిత్ర పరిశ్రమ బంద్ నిరవధికంగా కొనసాగుతోంది. ఫైటర్స్ సమస్యతో ప్రారంభమైన ఈ బంద్ ఇప్పుడు హీరోల దగ్గరకి వచ్చి ఆగినట్లు తెలుస్తోంది. కాస్ట్‌ఆఫ్ ప్రొడక్షన్‌ను కంట్రోల్ చేసే భాగంలో హీరోల పారితోషికాలు తగ్గించుకోవాలని నిర్మాతలు సూచించారు. అయితే ఎవరు చెప్పినా తాము వినేది లేదని కొందరు హీరోలు భీష్మించుకు కూర్చోవటమే బంద్ ఆగకపోవటానికి కారణమని తెలుస్తోంది. అందులోనూ సినిమా పరిశ్రమ అనేది డిమాండ్ అండ్ సప్లయి మాత్రమే నని డిమాండ్ లేకపోతే మీరు ఇవ్వమన్నా ఇవ్వరని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
మరో ప్రముఖ యంగ్ హీరో....మలయాళంలో మమ్ముటి ఇటీవలే మాట్లాడిన సందర్భాన్ని ప్రస్తావించి మరీ మాట్లాడి అందరి నోళ్ళూ మూయించే ప్రయత్నం చేసాడు. ఆయన మాటల్లో...మలయాళంలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. తన మార్కెట్ కోటిరూపాయలుపైనే ఉందనీ, దానికి తగినట్లుగానే చిత్రాన్ని ప్లాన్ చేసుకోవాలని మమ్ముట్టి సూచించిన విషయాన్ని తెలుగు నిర్మాతలకు హీరోలు సూచించారు. ఇక మరికొందరైతే హీరోల ని భరించటం తప్పదు కాబట్టి వారి రెమ్యునేషన్ కోత విధంచటం కన్నా అంతగా డిమాండ్ లేని నటీనటుల సౌకర్యాలు తగ్గించుకోవాలని కొందరు సూచించారు.


Click it and Unblock the Notifications