Actor Second Marriage: 61 ఏళ్ల వయసులో నటుడి రెండో పెళ్లి... ప్రకాష్ రాజ్ అడ్వైజ్ వల్లేనా?

ఆశీష్ విద్యార్థి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. ముఖ్యంగా ఆశీష్ విద్యార్థి అనగానే పోకిరి చిత్రం గుర్తుకు వస్తుంది. ఇక ఆ సినిమాతోనే ఆయన మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఆశీష్ విద్యార్థి ఆ మధ్య తన భార్యకు విడాకులు ఇచ్చి... రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పట్లో ఈ న్యూస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే దీనికి కారణం ప్రకాష్ రాజ్ అని తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ క్యారెక్టర్ ల్లో నటించే ఆశీష్ విద్యార్థి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పుడున్న స్టార్ హీరోల సినిమాల్లో నటించి.. క్రేజ్ సంపాదించుకున్నారు. ఈయన ముఖ్యంగా పోకిరి సినిమా ద్వారా టాలీవుడ్ లో మంచి ఇమేజ్ కైవసం చేసుకున్నారు. అలా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఒడియా, మలయాళం, మరాఠీ, బెంగాలీ వంటి భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు ఆశిష్ విద్యార్థి.

Reason Behind The Actor Ashish Vidyarthi Second Marriage Prakash Raj Advice to Him News Goes Viral

అయితే ఆశిష్ విద్యార్థి తన 61 ఏళ్ల వయసులో రూపాలి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ న్యూస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ వయసులో రెండో పెళ్లి ఏంటి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు. అయితే 61 ఏళ్ల వయసులో ఈయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం ప్రకాష్ రాజ్ అని తెలుస్తోంది. ఈ న్యూస్ అప్పుట్లో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది.

ఇక 2023 సంవత్సరంలో ఆశీష్ తన మొదటి భార్య రాజోషితో విడాకులు తీసుకున్నారు. తను ఇష్టపడ్డ ప్రేమించిన అమ్మాయి రూపాలీని అధికారికంగా రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి రెండో పెళ్లి చేసుకున్న సమయంలో ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈ వయసులో రెండో పెళ్లి ఎందుకు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ట్రోలింగ్ చేశారు. పెళ్లి చేసుకుని చాలా ఏళ్లు గడిచాక.. భార్యతో విడాకులు ఎందుకు అంటూ నెటిజన్స్ ట్రోల్ చేశారు.

Reason Behind The Actor Ashish Vidyarthi Second Marriage Prakash Raj Advice to Him News Goes Viral

రాజోషి, ఆశిష్ విద్యార్థి ఇద్దరూ ఈ వయసులో విడాకులు తీసుకోవడానికి కారణాన్ని అప్పట్లో ఆశిష్ విద్యార్థి క్లారిటీ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్లినా దానికి సంబంధించిన వీడియోలు తీసి యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసేవారు ఆశీష్. అలా ఓ సారి ఫ్యాషన్ డిజైనర్ అయిన రూపాలీ దగ్గరికి వెళ్లి క్లాత్ వ్లాగ్ తీసిన సమయంలో రూపాలీతో స్నేహం ఏర్పడింది. అలా వీరి స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది. రూపాలీ బ్యాగ్రౌండ్ ఆమె కష్టాలు తెలుసుకున్న ఆశిష్ విద్యార్థి ఆమెకు దగ్గరయి ప్రేమలో పడిపోయారు.

దాని వల్లే ఆశీష్ విద్యార్థి, రూపాలి ఇద్దరు రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఇక పెళ్ళై ఓ కొడుకు ఉండడంతో ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేక ఆశిష్ విద్యార్థి తన ఫ్రెండ్ అయినా ప్రకాష్ రాజ్ ని సజేషన్ అడిగారని తెలుస్తోంది. ఇక అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ప్రకాష్ రాజ్... నీకు ఏది అనిపిస్తే అది చేయ్ అంటూ చెప్పుకు వచ్చారట. నీకు రూపాలీ మీద మర్చిపోలేనంత ప్రేమ ఉంటే ఆమెను పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారట ప్రకాష్ రాజ్.

ఆశీష్ విద్యార్థి.. రూపాలీని మర్చిపోలేక మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. రూపాలినీ చెసుకున్నాడు. ఇలా ఆశిష్ విద్యార్థి మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి పరోక్షంగా ప్రకాష్ రాజ్ కారణం అయ్యారని నెట్టింట వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X