Gaddar గద్దర్ మృతికి కారణాలు ఇవే.. ఎల్బీ స్టేడియానికి భౌతికకాయం.. అంత్యక్రియలు ఎప్పుడంటే?
ప్రజా యుద్ధనౌక గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ ఇకలేరు. విప్లవ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలకు గొంతుకై నిలిచిన ప్రజా పోరాటయోధుడు గళం మూగబోయింది. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న గద్దర్ మెరుగైన చికిత్స కోసం ఇటీవల హైదరాబాద్‌లోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో విప్లవ శ్రేణులు, సినీ అభిమానులు, ఉద్యమకారులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. గద్దర్ మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గద్దర్ మరణానికి అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ వర్గాలు వెల్లడించిన కారణం ఏమిటంటే?
అమీర్‌పేట్ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం.. గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు. ఊపిరితిత్తులు, మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన అడ్వాన్స్ స్టేజ్‌లో హస్పిటల్‌లో చేరారు అని ప్రకటనలో తెలిపారు.

అంతేకాకుండా ఆయన తీవ్రమైన హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన జూలై 20వ తేదీన హాస్పిటల్‌లో చేరారు. ఆగస్టు 3వ తేదీన ఆయననకు బైపాస్ సర్జరీ జరిగింది. అనంతరం బాగా కోలుకొన్నారు. అంతలోనే ఆయనకు ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలు తలెత్తాయి. ఆ సమస్యతో ఆయన ఆరోగ్యం విషమించడంతో గద్దర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు అని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ వైద్య వర్గాలు బులెటిన్‌లో వెల్లడించారు.
ఇదిలా ఉండగా, గద్దర్ మరణవార్తతో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, సన్నిహితులు హాస్పిటల్‌కు చేరుకున్నారు. ఆయన పార్దీవ దేహానికి శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన భౌతిక దేహాన్ని హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియానికి తరలించారు. అభిమానుల సందర్శనార్తం కోసం భౌతికకాయాన్ని అక్కడే ఉంచుతారని సన్నిహితులు తెలిపారు.

గద్దర్ అంత్యక్రియలను సోమవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ాయన అంత్యక్రియలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అమర వీరుడికి అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











