జులాయిగా తిరుగుతున్న రాజమౌళిని అస్కార్ రేంజ్ డైరెక్టర్ అయ్యేలా చేసిందెవరంటే?

రాజమౌళి ఇప్పుడు కేవలం తెలుగు డైరెక్టర్ మాత్రమే కాదు. ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న పాన్ వరల్డ్ రేంజ్ ఉన్న డైరెక్టర్ గా మారిపోయాడు. నిజానికి ఆయన ఇప్పుడంటే ఇలా ఉన్నాడు కానీ.. ఒకప్పుడు అందరి కుర్రాళ్ల లాగానే టైం పాస్ చేయడానికి ఇష్టపడుతూ ఉండేవాడట. అయితే ఒకరి మాటలు ఆయన మీద బాగా ప్రభావం చూపి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టేలా చేశాయని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

సీరియల్ డైరెక్టర్ గా : శాంతి నివాసం సీరియల్ తో దర్శకుడిగా కెరియర్ ప్రారంభించి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సినిమా డైరెక్టర్ గా మారాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అనేక సినిమాలకు రచయితగా పనిచేశారు. కథలు అందించడమే కాదు కొన్ని సినిమాలకు డైలాగ్స్ కూడా అందించారు ఆయన. అయితే అలాంటి ఆయన కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రాజమౌళి ముందుగా సాగర్ అనే దర్శకుడు దగ్గర కొన్నాళ్లపాటు శిష్యరికం చేశారు.

rajamouli
ఆ తర్వాత సినిమా అవకాశం : ఆ తరువాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి అనేక సినిమాలకు పని చేశారు. రాఘవేంద్రరావుతోనే శాంతి నివాసం అనే సీరియల్ డైరెక్టర్ గా మారిన రాజమౌళి ఆ సీరియల్ తో మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక ఆ సీరియల్ తర్వాత ఆయనకు ఏకంగా సినిమా చేసే అవకాశం వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా చేయాల్సి వచ్చింది.

rajamouli
అల్లరి చిల్లరగా : నిజానికి ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి ఈ సినిమా చేయడం రాజమౌళికి ఇష్టం లేదు. కానీ మొదటి సినిమా అవకాశం రావడంతో కాదనలేక ఒప్పుకున్నారట. అయితే తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటన చూసిన తర్వాత కచ్చితంగా హిట్టు కొడతానని నమ్మకం వచ్చిందని రాజమౌళి కొన్ని సందర్భాల్లో వెల్లడించారు. అయితే ఇలా సినీ రంగ ప్రవేశం చేయడం కంటే ముందు తాను కూడా అందరిలాగానే అల్లరి చిల్లరగా తిరిగే వాడినని ఆయన ఒక ఇంటర్వ్యూలో గతంలో వెల్లడించారు.

keeravaniwifesrivalli1
13 మంది కలిసి : తమకు మొత్తానికి చాలా ఆస్తి ఉండేదని తమ తండ్రుల హయాంలో కర్ణాటకలోని రాయచూరు ప్రాంతంలో సుమారు 300 ఎకరాల పొలం ఉండేదని చెప్పుకొచ్చారు. అయితే అవన్నీ నాశనం అయిపోయాయని ఎలా అయినా సీని రంగంలో రాణించాలని ఉద్దేశంతో తమ కుటుంబ సభ్యులందరం 13 మంది కలిసి చెన్నై వచ్చి ఒక సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో నివసించే వారం అని చెప్పుకొచ్చాడు. తన తండ్రి పెదనాన్న ఇద్దరు సినిమాలకు రచయితలుగా పని చేసేవారు.
keeravaniwifesrivalli1

శ్రీవల్లి తల్లిగానే : కానీ ఎప్పుడో కానీ డబ్బులు వచ్చేవి కాదని తన అన్న కీరవాణి పలువురు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేస్తూ వచ్చిన జీతంతోనే 13 మంది తిని ఉండే వాళ్ళమని చెప్పుకొచ్చాడు. ఇక తన వదిన శ్రీవల్లిని ఎప్పుడూ వదినా అని పిలవలేదని వయస్సు ఎక్కువే ఉండడంతో తల్లిగానే చూస్తూ ఉండేవారమని ఆయన అన్నాడు.

rajamouli3

అయితే యుక్త వయసు వచ్చాక ఏమి పట్టించుకోకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్న నేపథ్యంలో తమ బంధువులు తనను సూటిపోటి మాటలతో వేధించేవారని ఒక రోజు ఇది గమనించిన శ్రీవల్లి దగ్గరకు పిలిచి నా కొడుకుని ఇలా అందరూ మాటలు అనడం నాకు నచ్చడం లేదని ఆవేదన వ్యక్తం చేసిందని... చెప్పుకొచ్చాడు. ఆవిడ మాటలు తన మీద ప్రభావం చూపి తాను ఏదో ఒకటి సాధించాలనే కసితో సీనిరంగంలో ప్రవేశించానని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X