For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎనాలసిస్ : బ్రూస్ లీ, సర్దార్ బోల్తా- సరైనోడు, సుప్రీమ్ చల్తా

  By Srikanya
  |

  హైదరాబాద్: గత రెండు రోజులుగా ఓ స్లోగన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే.. మెగా ఫ్యామిలీకు ఎదురులేదు..'సుప్రీమ్' కలెక్షన్స్ కు కొదవలేదు అని. మెగా ఫ్యాన్స్ ఎంతవరకూ సాయి ధరమ్ తేజ తాజా చిత్రం సుప్రీమ్ కు సపోర్ట్ చేసారో కానీ అది..మెగా హీరోల హిట్ అనే ఖాతాలో మాత్రం పడిపోయింది.

  ఈ నేపధ్యంలో ఓ కొత్త టాపిక్ మీడియాలో చర్చకు వచ్చింది. అదే వరసగా రామ్ చరణ్ బ్రూస్ లీ, పవన్ సర్దార్ డిజాస్టర్స్ అయ్యాయి. కానీ అల్లు అర్జున్ సరైనోడు, సాయి ధరమ్ తేజ సుప్రీమ్ చల్తా అనిపించుకున్నా కలెక్షన్స్ వైజ్ కుమ్మేస్తున్నాయి. ఎక్కడుంది తేడా... ఆ రెండు ప్లాఫ్ లకు, ఈ రెండు హిట్ లకు కారణాలేంటి అని.

  సర్దార్, బ్రూస్ లీ చిత్రాలు గమనిస్తే ప్రేక్షకులకు ఫలానా కావాలనే మీటర్ వేసుకుని కామెడీ, ఫైట్స్, పాటలు అన్నట్లు సాగుతాయి..కథని మాత్రం వదిలేసారు. అదే సరైనోడు, సుప్రీమ్ కు వచ్చే సరికి కథ ఎలాగున్నా ఓ బిగిన్, మిడిల్, ముగింపు అనేది స్పష్టంగా కనపడుతుంది. అదే సినిమాలకు ప్లస్ అయ్యిందని విశ్లేషిస్తున్నారు.

  సరైనోడుకు ఫైట్స్ మాస్ కు కిక్కు ఇస్తే, సుప్రీమ్ లో కామెడీ కలిసి వచ్చింది. అదే సర్దార్ విషయానికి వచ్చేసరికి ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయి, కంటెంట్ తగ్గిపోయి సినిమాని చంపేసింది. బ్రూస్ లీ అయితే సెకండాఫ్ ని భరించలేని స్దితికి తీసుకు వచ్చారు.

  ఈ నాలుగు సినిమాలు హిట్, ఫ్లాఫ్ లకు సెకండాఫ్ కీలకంగా నిలిచింది. సెకండాప్ బాగుది లేదా బాగోలేదు అనేదే సినిమా ఫేట్ ని డిసైడ్ చేసింది. స్క్రిప్టు విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది అని బ్రూస్ లీ, సర్దార్ లకు అందరూ అన్నారు. సుప్రీమ్ కు స్క్రిప్టే ఈ రోజు ప్లస్ అయ్యింది.

  ఈ మధ్య కాలంలో వచ్చిన మెగా మూవీలు (సరైనోడు తప్ప )అన్నీ వరుసగా థియోటర్స్ వద్ద బోల్తాపడటంతో...సుప్రీమ్ మూవీ మాత్రం ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చి ఊపిరి పోసిందని చెప్పవచ్చు. మూవీ కథ విషయానికి వస్తే, ఇది చిన్న కథే అయినప్పటికీ..హీరో,హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను కట్టిపడేంది.

  స్లైడ్ షోలో మరికొంత ఎనాలసిస్

  సర్దార్ కు అదే మైనస్

  సర్దార్ కు అదే మైనస్

  పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాతంగా కథ అందించి మరీ రూపొందించిన సర్దార్ గబ్బర్ సింగ్ కు ఓ నిర్ధిష్టమైన కథ,కధనం లేకపోవటమే దెబ్బ కొట్టింది.

  సెకండాఫ్ ప్లాబ్లం

  సెకండాఫ్ ప్లాబ్లం

  ముఖ్యంగా సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ అవ్వటానికి కారణంగా సెకండాఫ్ లో వరసపెట్టి కామెడీ ఎపిసోడ్స్ రావటమే కానీ కథ కొంచెం కూడా కదలకపోవటం అనేది మరో కారణం

  పవన్ వంటి హీరో

  పవన్ వంటి హీరో

  సర్దార్ గబ్బర్ లో విలన్ ని పవన్ వంటి హీరో ఓ ఆటాడిస్తాడని, దాని నుంచి తప్పించుకోవాటనికి విలన్ మరో ఎత్తు వేస్తాడని, ఇలా ఆసక్తికరంగా సాగుతుందని అంతా భావిస్తే... అటువంటిదేమీ జరగకుండా ఓ చిన్న కామెడీ సీన్ తో క్లోజ్ చేసారు.

  బ్రూస్ లీ

  బ్రూస్ లీ

  శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన రామ్ చరణ్ ..బ్రూస్ లీ చిత్రంలో ...సెకండాఫ్ పూర్తి గా గాడితప్పింది. బ్రహ్మానందంను అడ్డం పెట్టి ఎప్పటిలా శ్రీనువైట్ల దాటేద్దామనుకున్నారు కానీ రామ్ చరణ్ వంటి యాక్షన్ ఇమేజ్ ఉన్న హీరోకు అది సెట్ అవదని భావించలేదు.

  సరైనోడు

  సరైనోడు

  ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది..యాక్షన్ ఎపిసోడ్స్ అంటున్నా..ఆ యాక్షన్ ఎపిసోడ్స్ వెనక వాటిని నిలబెట్టే కథ,కథనం కొంతవరకూ ఉంది. ముఖ్యంగా విలన్ ని ఎదుర్కోవటానికి అల్లు అర్జున్ సెకండాఫ్ లో చేసే ప్రయత్నాలు , ఫైట్స్ జనాలకు నచ్చుతున్నాయి.

  విలన్- హీరో గేమ్

  విలన్- హీరో గేమ్

  సరైనోడు లో... విలన్ ని కార్నర్ చేయటానికి హీరో సరైనోడులో ఆడిన గేమ్ రొటీన్ అయినప్పటికి కొత్తగా ప్రెజెంట్ చేయటం కలిసి వచ్చింది. బ్రీత్ టేకింగ్ యాక్షన్ సీన్స్ తో రక్తికట్టించి, పాత అనేది మరించారు బోయపాటి

  సుప్రీమ్ ...

  సుప్రీమ్ ...

  సాయి ధరమ్ తేజ సుప్రీమ్ ఈ రోజున మాస్ కు ఎక్కుతోందంటే దానికి కారణం..దర్శకుడు సినిమా ని ఫన్ తో నింపటమే కాకుండా..ఓ స్టోరీలైన్ , దానికి కొంత ఎమోషన్, విలన్ తో గేమ్ పెట్టటమే.

  కామెడీ సినిమాగా

  కామెడీ సినిమాగా

  సుప్రీమ్ ని ఓ మాస్ యాక్షన్ చిత్రంగా కాకుండా ఓ కామెడీ చిత్రంగా చూసేవాళ్లు భావించటంతో చాలా లాజిక్స్ కు పెద్దగా వివరణ ఇవ్వాల్సిన అవసరం దర్శకుడుకు లేకపోయింది.

  English summary
  Supreme impress the audience big time for Sai Dharamtej’s acting skills and Anil Ravipudi’s flawless presentation and execution.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X