తెలుగు సినీ రంగంలో మరో విషాదం.. యాక్సిడెంటులో త్రినయని సీరియల్ నటి మృతి!
ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో వరుసగా పెను విషాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని సినీ రంగాల్లో చాలా మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం సినీ నటులే కాకుండా.. సీరియల్స్ కు సంబంధించిన నటీనటులు కూడా మృతి చెందుతున్నారు. అయితే తాజాగా తెలుగు బుల్లితెరపై లేడీ విలన్ గా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసిన ఓ ముద్దుగుమ్మ ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఎవరో కాదు.. త్రినయని సీరియల్ నటి పవిత్రా జయరామ్. త్రినయనికి అత్త క్యారెక్టర్ లో కనిపిస్తున్న ఈమె మృతికి సంబంధించిన పూర్తి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మే 12వ తేదీ అంటే ఈరోజు నటి పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కర్ణాటకకు చెందిన ఈమె హైదరాబాద్ లో ఉంటూ సీరియల్స్ లో నటిస్తోంది. అయితే తాజాగా ఈమె తన సొంతూరికి వెళ్లింది. అయితే తిరిగి హైదరాద్ వస్తుండగా.. రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి(బి) గ్రామం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతల్లి డివైడర్ ను ఢీకొట్టింది. ఇది జరుగుతుండగానే.. కుడివైపు నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.

అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నటి పవిత్రా జయరామ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అలాగే తనతోపాటు కారులో వస్తున్న ఆమె బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, సహ నటుడు చంద్రకాంత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే విషయం గుర్తించిన స్థానికులు అంబులెన్స్ తో పాటు పోలీసులకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బందితో పాటు పోలీసులు కూడా హుటాహటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలరించారు. అలాగే మృతదేహాన్ని కూడా స్థానిక ఆస్పత్రికి చేర్చారు.

పవిత్రా జయరామ్ మృతి వార్త తెలుసుకున్న సినీ నటులతో పాటు అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. అలాగే గాయాల పాలైన ప్రతీ ఒక్కరూ క్షేమంగా బయటకు రావాలని అంటున్నారు. పవిత్రా జయరామ్ తో పాటు సీరియల్స్ లో నటించిన ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. పవిత్రా జయరామ్ కు ఓ కూతురుతో పాటు కొడుకు కూడా ఉన్నాడు. పెద్దగా చదువుకోని ఈమె సీరియల్స్ లోకి వచ్చి అనేక సీరియల్స్ లో నటించింది. త్రినయని సీరియల్ తో బాగా గుర్తింపు తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











