హరికృష్ణ మృతి: సీట్ బెల్ట్ పెట్టుకోలేదా.. ఎస్పీ చెప్పిన కారణాలు!
Recommended Video

నందమూరి హరికృష్ణ నేటి ఉదయం నల్గొండ సమీపంలో అన్నెపర్తి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. హరికృష్ణ మరణంతో కుటుంబ సభ్యులు, సినీ వర్గాలు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఊహించని శోకం ఎదురుకావడంతో హరికృష్ణ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంత ఘోరమైన ప్రమాదం జరగడానికి గల కారణాలు అతివేగమే అని వార్తలు వస్తున్నాయి.

స్పందించిన నల్గొండ ఎస్పీ
నందమూరి హరికృష్ణ మృతి పట్ల నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. వేరంగా ప్రయాణించడం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు తమ విచారణ ద్వారా తెలుసుకున్నాం అని ఆయన తెలిపారు.

2323 నంబర్
హరికృష్ణ ఏ వాహనం తీసుకున్న 2323 అనే నంబర్ ఉంటుందట. ఏపీ 28 బీడబ్ల్యూ 2323 అనే వాహనంలో ఆయన నెల్లూరుకు బయలుదేరారు. కారుని హరికృష్ణ డ్రైవ్ చేసినట్లు రంగనాథ్ తెలిపారు. వాహనం నల్గొండ సమీపంలో చాలా వేగంగా ప్రయాణించినట్లు తెలుస్తోంది.

సీట్ బెల్ట్
హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోలేదని కూడా రంగనాథ్ అభిప్రాయ పడ్డారు. అందువలనే ఇంతపెద్ద ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రమాద సమయంలో కారు గంటకు 160 కిమీ వేగంలో ప్రయాణిస్తుంది కూడా తెలిపారు.

15 అడుగుల ఎత్తు
డివైడర్ ని ఢీకొట్టిన వెంటనే హరికృష్ణ వాహనం గాల్లోకి 15 అడుగుల ఎత్తు ఎగిరిందట. ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో హరికృష్ణ కారునుంచి 30 అడుగుల దూరంలో పడడం వలన తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించినా అప్పటికే పరిస్థితి విషమించి హరికృష్ణ మృతి చెందారు.


Click it and Unblock the Notifications











