Prabhas: డైనోసార్‌ను డార్లింగ్‌గా మార్చేసిన మారుతి.. ఇది కదా ప్రభాస్ ఫ్యాన్స్‌కు అసలైన న్యూఇయర్ ట్రీట్!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ ట్రీట్ వచ్చేసింది. ప్రభాస్.. పెద్ద సినిమాలతో పాటు.. మారుతి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. దాంతో పాటు... ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బహుబలి తర్వాత ప్రభాస్ కు సరైన హిట్ పడలేదు. ఇక తాజాగా నటించిన సలార్ సినిమాతో మరోసారి పుల్ ఫాంలోకి వచ్చేశాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ డైనోసార్ గా కనిపించి.. ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు. ఇక ఆయన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Rebal Star Prabhas Director Maruthi Movie First Look Poster Released Full Details Here

ఇక ప్రభాస్... డైరెక్టర్ మారుతితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ... షూటింగ్ మాత్రం ఎప్పటి నుంచో జరుపుకుంటుంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది ఈ మూవీ. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ రాజా డిలాక్స్. ఇక ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారా... లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే షూటింగ్ ఫోటోస్ కూడా లీక్ అయిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ మారుతి సినిమాను పీపూల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను అందించింది పీపూల్ మీడియా. మారుతి, ప్రభాస్ మూవీ నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. పీపూల్ మీడియా ఫ్యాక్టరి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి... ఓ ఫోటోను పోస్ట్ చేశారు. అందులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సగర్వంగా డైనోసార్‌ను సంపూర్ణ డార్లింగ్‌గా మార్చిందంటూ రాసుకువచ్చింది. ఇక దానితో పాటు.. ప్రభాస్ ఫోస్టర్ ను షేర్ చేసింది.

ఇక ఫస్ట్ లుక్, అండ్ టైటిల్ అనౌన్స్ మెంట్ ఈ సంక్రాంతికి ఉంటుందని చెప్పుకువచ్చింది. ఇక ఈ పోస్టర్ గమనిస్తే.. ప్రభాస్ ను కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. అందులో ప్రభాస్ లుక్ కనబడకపోయినా... ప్రభాస్ రూపంతో ఓ డిజైన్ పోస్టర్ ను పంచుకున్నారు. ఈ పోస్టర్ చూసిన నెటిజన్స్.. హమ్మాయ్య మా ప్రభాస్ మళ్లీ డార్లింగ్ లుక్ లోకి వచ్చేశారని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ సినిమాను పీపూల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మిస్తున్నారు.

ఇక సంక్రాంతికి అసలైన ట్రీట్ రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లీక్ అయిన ప్రభాస్ లుక్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి మూవీ టీం అదే టైటిల్ ని అనౌన్స్ చేస్తుందా లేదా మరో టైటిల్ ని ప్రకటిస్తుందా అనేది చూడాలి. ఈ సినిమా హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X