ప్రభాస్ 'రెబల్'బిజినెస్ (ఏరియావైజ్)
ప్రభాస్ తాజా చిత్రం 'రెబల్'. లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంకి ట్రేడ్ లో మంచి రేట్లు పలుకుతున్నాయి. పవన్,మహేష్,ఎన్టీఆర్,రామ్ చరణ్ చిత్రాల తరహాలో ఈ చిత్రం బిజినెస్ చాలా క్రేజ్ గా జరుగుతోంది. 'రెబల్'లో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేస్తున్నారు.
ఇప్పటివరకూ జరిగిన బిజినెస్..డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ట్రేడ్ లో చెప్పుకుంటున్న సమచారం ప్రకారం...
నైజాం.........దిల్ రాజు (9 కోట్లు)
సీడెడ్ బల్లారి సాయి,ఎన్.వి ప్రసాద్(6 కోట్లు)
వైజాగ్ బెల్లంకొండ సురేష్ ( 3.15 కోట్లు)
ఈస్ట్ గోదావరి అనుశ్రీ ఫిల్మ్ (2.2 కోట్లు)
వెస్ట్ గోదావరి (1.9 కోట్లు)
లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అతని పాత్ర ఢిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. దాని గురించి చెపుతూ...అతను నిరంతరం మండే అగ్నిగోళంలాంటివాడు. మిట్టమధ్యాహ్నం సూర్యుడు ఎలా భగభగలాడుతూ కనిపిస్తాడో... అతను అలానే ఉంటాడు. ఆ సెగను ఆపడం ఎవరి తరం కాదు. బుల్లెట్ అయితే ఒక గుండెనే చీల్చుతుంది. అతను మిస్సైల్..ఒక్కసారిగా శత్రు స్థావరాన్ని మట్టుపెట్టేస్తాడు. ఇదంతా ప్రత్యర్థులకే. ప్రేమిస్తే మాత్రం సాయంకాలపు చిరుగాలిలా ఆహ్లాదాన్ని పంచుతాడు. ఇంతకీ అతగాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు లారెన్స్.
అలాగే ప్రభాస్ సైతం ఈ చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన ఈ చిత్రం గురించి చెపుతూ..షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇస్తున్న సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా అని ప్రభాస్ చెప్తున్నారు. తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: 'డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.


Click it and Unblock the Notifications











