అక్కడ తొలి తెలుగు సినిమాగా ‘రెబల్’ రికార్డ్
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'రెబల్' ఈ నెల 28న విడుదలకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించగా... తమన్నా, దీక్షా సేథ్ లీడ్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు. గ్రాండ్‌గా విడుదల సిద్దం అవుతున్న 'రెబల్' చిత్రం తాజాగా ఓ రికార్డ్ సొంతం చేసుకుంది.
ఈ చిత్రాన్ని పంజాబ్ రాష్ట్రంలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని బిగ్ సినిమాస్, వివా మల్టీప్లెక్స్ ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం కూడా పంజాబ్‌లో రిలీజ్ కాలేదు. ప్రభాస్ 'రెబల్' చిత్రం మాత్రమే తొలిసారి ఆ ఘనత సాధించింది.
గతంలో చండీఘర్‌లో తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ అది కేంద్ర పాలిత ప్రాంతం. దీన్ని పంజాబ్, హర్యానా రాష్ట్రాలు షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి అది పంజాబ్ రాష్ట్రం కిందకి రాదనే చెప్పాలి. ఈ లెక్క ప్రకారం పంజాబ్ రాష్ట్రంలో విడుదలవుతున్న తొలి తెలుగు మూవీగా ప్రభాస్ 'రెబల్' రికార్డుల కెక్కింది.
'రెబల్' చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 'ఎ' సర్టిఫికెట్ పొందిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ప్రభాస్ సరసన తమన్నా, దీక్షా సేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











