ప్రభాస్ స్టన్నింగ్ యాక్షన్ (రెబెల్ టీజర్)

దీన్ని చూస్తే ఈ చిత్రంలో ప్రభాస్ అదిరిపోయే స్టిన్నింగ్ సీన్స్ చేశాడని స్పష్టం అవుతోంది. ఈ టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేసింది. టీజర్ విడుదల చేసిన దిల్ రాజుమ మాట్లాడుతూ...ఈ ఒక్క టీజర్ చాలు సినిమా హిట్టని చెప్పడానికి, ప్రభాస్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. రెబెల్ అభిమానులకు పండగే అన్నారు.
దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ నేనీ సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఒకటే అనుకున్నాను. ప్రభాస్ క్యారెక్టర్ డిపరెంటుగా ఉండాలని. ఏ సినిమాలో లేని విధంగా అతన్ని చూపించాలనుకున్నాను. నేనేనా ఇలా నటించింది అనుకునేలా ప్రభాస్ పాత్ర ఉంటుందని చెప్పారు.
ఈ చిత్రం ఫ్యామిలీ సెంటిమెంట్, యాక్షన్, కామెడీ కలిగిన చిత్రమని, ఒక సినిమా సక్సెస్ కావడానికి కావాల్సిన అన్ని మసాలాలు ఇందులో ఉన్నాయని నిర్మాతలు భగనవాన్, పుల్లారావులు తెలిపారు. త్వరలోనే ఆడియో విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు : డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ : సి.రాంప్రసాద్, కూర్పు : మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ : ఎఎస్ ప్రకాష్, పైట్స్ : రామ్ లక్ష్మణ్, నిర్మాతలు : భగవాన్, పుల్లారావు, కథ-స్ర్కీన్ ప్లే-సంగీతం-దర్శకత్వం : రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











