twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రెబల్’ హిందీ రైట్స్... షాకింగ్, నిజమేనా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రెబల్' చిత్రం ఇటీవల విడుదలై మైనస్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమా దాదాపుగా ప్లాపైనట్లే అని సినీ సర్కిల్లో సాగుతున్న చర్చ. కలెక్షన్లు కూడా భారీగా పడి పోయాయి. అయినా ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్మడు పోయినట్లు తెలుస్తోంది.

    సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం 'రెబల్' చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 2.15 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది. ప్రభాస్ కు హిందీలో పెద్దగా ఫాలోయింగ్ లేదు. ఈ నేపథ్యంలో ఆయన సినిమా హిందీ రైట్స్ ఈ రేంజిలో రావడం నమ్మశక్యంగా లేదు. అయితే ఇది గాలి వార్త కావచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.

    ప్రభాస్ గత సినిమా డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ హిట్ చిత్రాలు కావడంతో 'రెబల్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రెబల్ చిత్రం అంచనాలను అందుకోలేక పోయింది. లారెన్స్ ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించడంలో విఫలం అయ్యాడు. ఫస్టాఫ్ రొటీన్ స్క్రీన్ ప్లే, సెకండాఫ్ లో భరించలేని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు తలనొప్పి తెప్పించాయి.

    ప్రభాస్ సరసన తమన్నా, దీక్షా సేథ్ నటించారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషించారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ఇతర పాత్రలు చేసారు. ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

    English summary
    It is heard that Hindi dubbing rights of Rebel were sold Rs. 2.15 crores. ‘Rebel’ has got a flop talk and collections are also slowing down day by day. To everybody’s surprise, Hindi dubbing rights of the movie have been sold for a whopping price.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X