For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ పర్సనాలిటీకి, ఇమేజ్ కి ఫర్ ఫెక్ట్ మ్యాచ్: రెబల్...!

    By Sindhu
    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడుగా హిట్ చిత్రాల దర్శకుడు లారెన్స్ దర్శకత్వంలొ శ్రీ బాలాజీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె భగవాన్, జె పుల్లా రావు నిర్మిస్తున్న భారీ చిత్రం 'రెబల్" ఈ చిత్రం చిత్రీకరణ లో భాగంగా రెండు షెడ్యూల్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకొని మూడవ షెడ్యూల్ ఈ నెల 15 నుండీ హైదరాబాదులో ప్రారంభం కానుంది. ఈ చిత్ర విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర నిర్మాతలు జె పుల్లా రావు, కె భగవాన్ మాట్లాడుతూ ఈ నెల 15 నుండి హైదరాబాదు లో మూడవ షెడ్యూల్ ప్రారంభమై ఏకధాటిగా చిత్రం పూర్తి అయ్యేవరకూ హైదరాబాద్, వైజాక్, బ్యాంకాక్ లలో జరుగుతుందని తెలిపారు.అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ తో తమన్నా తొలిసారిగా నటిస్తుందని ,మరో కథానాయకిగా దీక్షాసేథ్ నటిస్తుందని,తెలిపారు.

    చిత్ర దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ ఓ సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వాలనే పట్టుదలతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రభాస్ తన పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు.ప్రభాస్ పర్సనాలిటీకీ, ప్రభాస్ ఇమేజ్ కీ పర్ఫెక్ట్ గా సరిపోయే సబ్జెక్ట్ ఇది. ఈ చిత్రంలోని హీరో పాత్రను ప్రభాస్ తప్ప మరెవ్వరూ చేయలేరు.ప్రభాస్ ఈ చిత్రంలో అత్యద్భుతంగా నటిస్తున్నారు అని తెలిపారు. ప్రభాస్ మాట్లాడుతూ లారెన్స్ ఈ చిత్రాన్ని ఎక్స్ ట్రార్డినరీగా తీస్తున్నారు. 'మిస్టర్ పర్ఫెక్ట్ "తర్వాత వస్తున్న ఈ సినిమాలో నా లుక్ డిఫరెంట్ గా వుంటుంది. షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడింది అని తెలిపారు. ఈ ఈ చిత్రానికి తమన్ తన సంగీత బాణీలను అందిస్తున్నారు.

    English summary
    After a long gap choreographer Lawrence directing a Telugu film with hero Prabhas. Tamanna and Deeksha Seth doing main female lead. The movie titled as 'Rebel'. Rebel star Krishnam Raju playing Prabhas father role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X