twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రచారం కోసం ప్రభాస్ ‘రెబల్’ మళ్లీ వాయిదా

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రెబల్' చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ...మరో సారి వాయిదా పడింది. వాస్తవానికి ఈచిత్రాన్ని సెప్టెంబర్ 21న విడుదల చేయాల్సి ఉండగా...సినిమాకు ప్రచారం కల్పిస్తూ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిచడం కోసమని సెప్టెంబర్ 28కి చబటప వేసారు. ఆడియో ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఈ గ్యాప్‌లో ఎక్కువగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భారీ ఓపెనింగ్స్ రాబట్టవచ్చని దర్శక నిర్మాతల ఆలోచనగా కనిపిస్తోంది.

    ఇటీవల ఈచిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ...అభిమానులు ప్రభాస్‌ని ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి క్యారెక్టర్‌ని ప్రభాస్ చాలా ఎక్స్ లెంట్‌గా చేస్తున్నార. రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ చిత్రాల స్థాయిలో అద్భుతంగా తీస్తున్నారు. అన్ని ఎక్స్ పెక్టేషన్స్ కు ధీటుగా ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందుతున్న 'రెబల్' చిత్రాన్ని సెప్టెంబర్ నెలాఖరులో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

    English summary
    
 Young Rebel Star Prabhas’s action entertainer ‘Rebel’ has wrapped its entire shooting couple of days ago. The film was slated to release on September 21st, but the makers officially confirmed that, Rebel will hit the screens only on September 28th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X