‘రెబల్’ ప్రొడ్యూసర్‌కు ‘ఆరెంజ్’ కష్టాలు
రామ్ చరణ్ హీరోగా ఆ మధ్య వచ్చిన 'ఆరెంజ్' సినిమా చెర్రీ కెరీర్ లోనే పరమ ప్లాపుగా నిలిచిన విషయం తెలిసిందే. సినిమా నెగెటివ్ టాక్ తోడు, భారీ బడ్జెట్ సినిమా కావడంతో పెట్టుబడి తిరిగిరాక నిర్మాత నాగబాబును కష్టాల పాలయ్యాడు. అసలు ఆరెంజ్ సినిమా నిర్మించేప్పుడే ...ఆ సినిమా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ బడ్జెట్ పెంచేస్తున్నాడు అంటూ నాగబాబు గోల చేశాడని, బడ్జెట్ పై కంట్రోల్ లేక పోవడంపై చిరంజీవి కూడా అప్పట్లో భాస్కర్ ను మందలించాడనే వార్తలు వినిపించాయి. సినిమా షూటింగ్ ఆలస్యం కావడం కూడా బడ్జెట్ పెరిగి పోవడం కూడా ఓ కారణమే.
తాజాగా...ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రెబల్ సినిమా ప్రొడ్యూసర్లు కూడా 'ఆరెంజ్' సినిమా మాదిరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. రెబల్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న రాఘవ లారెన్స్ అడ్డూ అదుపు లేకుండా బడ్జెట్ పెంచేస్తున్నాడట. ప్రస్తుతం రెబెల్ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. ఇటీవలే కొత్తగా రెబల్ యూనిట్ లో జాయిన్ అయిన రాంప్రసాద్ అనే ఫోటో గ్రఫీ ఎక్స్ పర్ట్ నిర్మాతలకు గుదిబండలా మారాడని, కాస్లీ కెమెరాలు, అవీ ఇవీ అంటూ నిర్మాతను గుల్ల చేస్తున్నాడని, ఇతర విషయాల్లో కూడా లారెన్స్ బడ్జెట్ కంట్రోల్ చేయడకుండా నిర్మాతకు గుండె దడ తెప్పిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటం కూడా నిర్మాతకు తడిసిమోపెడు అవుతోందట.
ఏది ఏమైనా...బడ్జెట్ తక్కువ ఉంటేనే నిర్మాతకు, పరిశ్రమకు మంచిదనే వాదన ఎప్పటి నుంచో ఉంది. పెద్ద బడ్జెట్ సినిమాల వల్ల ఎక్కువ శాతం నష్టాలే తప్ప లాభాలు వచ్చిన దాఖలాలు చాలా తక్కవ. మరి ఈ విషయం గమనించకుండా రెబల్ దర్శకుడి పోకడపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications











