ఫైనల్ గా 'రెబెల్' రిలీజ్ డేట్ ఖరారు
హైదరాబాద్ : ప్రభాస్ తాజా చిత్రం 'రెబల్'. ఈ చిత్రం విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక అటుంవంటిదేమీ జరగదని,సెప్టెంబర్ 28న ఖచ్చితంగా విడుదల చేస్తామని నిర్మాత తెలియచేసారు. అలాగే సెప్టెంబర్ 14న గ్రాండ్ గా ఆడియో పంక్షన్ జరగనుందని అన్నారు. హైదరాబాద్ లో జరగనున్న ఈ ఆడియో పంక్షన్ కోసం ప్రస్తుతం భారీ ఎంత్తు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేజీపై సినిమాలోని ఓ పాటకు లారెన్స్ డాన్స్ చేయనున్నారు. ఈ సినిమాకు లారెన్స్ సంగీతం అందిచారు.
ఈ రెబెల్ చిత్రంలో కృష్ణరాజు ఓ కీలకమైన రోల్ చేస్తున్నారు. కథని మలుపుతిప్పే ఈ పాత్ర కోసమే సినిమా నడుస్తుందని చెప్తున్నారు. లారెన్స్ మాట్లాడుతూ...మా సినిమా లో హీరో కూర్చుని కబుర్లు చెప్పే రకం కాదు. రంగంలోకి దిగి చేసి చూపిస్తాడు. ఏటికి ఎదురీదడం అతనికిష్టం. పోరాడైనా గెలవడం అతని నైజం. ఇంతకీ అతని లక్ష్యం ఏంటి? అనేది మా చిత్రంలో చూడాల్సిందే అన్నారు.
అలాగే ప్రభాస్ శైలికి సరిపోయే చిత్రమిది.'రెబల్' అనేది టైటిల్ మాత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది.ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా 'ఛత్రపతి'. ఆ సినిమాను మించే స్థాయిలో మా 'రెబల్' ఉంటుంది మాస్‌ని అలరించేలా ఫైట్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అందరికీ నచ్చుతుంది. ప్రభాస్ కెరీర్‌లోనే 'రెబల్' హై బడ్జెట్ ఫిలిం అవుతుంది. అన్నారు.
ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











