‘రెబల్’కు పోటీగా మనుషులను పీక్కుతినే మూవీ

By Bojja Kumar

హైదరాబాద్: ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ చిత్రం ఎట్టకేలకు ఈనెల 28న విడుదల కానుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ యాక్షన్, తమన్నా, దీక్షా సేథ్ గ్లామర్ అభిమానులను మజా చేయనున్నాయి.

నిర్మాతలు మాట్లాడుతూ హైటెక్నికల్ విలువలతో స్టయిలిష్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ఆదరణ పొందాయని, త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుకలు జరుపనున్నామని, ఈ సందర్భంగా ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

మరో వైపు అదో రోజు హాలీవుడ్ మూవీ 'రెసిడెంట్ ఈవిల్-5' తెలుగులో విడుదలవుతోంది. కొలంబియా మూవీస్, ఆదేష్ ఫిలింస్ పతాకంపై కె.సదక్‌కుమార్, జి.మహేశ్వర్‌రెడ్డి ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ద్వారా తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అందిస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ చనిపోయిన మనిషి తిరిగి బతికి తోటి మనుషులను పీక్కుతినే క్రూరమృగంగా మారితే ఎలా వుంటుంది అన్న ప్రశ్నతో ఈ చిత్రం వుంటుందని, సన్నివేశాలు గగుర్భాటు కలిగేలా వుంటాయని, హారర్ జానర్‌లో ఇప్పటికే నాలుగు భాగాలు విజయవంతమయ్యాయని, ఐదవ భాగం కూడా విజయవంతమవుతుందన్న నమ్మకం వుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X