రికార్డు స్థాయిలో ప్రభాస్ ‘రెబెల్’ శాటిలైట్ రైట్స్?

By Bojja Kumar

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రెబెల్' చిత్రం విడుదలకు ముందు నుంచే సంచనాలు రేకిస్తూ ముందుకు సాగుతోంది. ప్రభాస్ కెరీర్లోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో ఈచిత్రం శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఈచిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 5.75 కోట్లు చెల్లించి దక్కించుకున్నట్లు సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు త్వరలోలో వెల్లడికానున్నాయి.

లారెన్స్ దర్వకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్‌ చేస్తున్నారు. కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లారెన్స్ ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. తన నిర్లక్ష్యపు వైఖరితో షూటింగ్ చాలా లేట్ చేస్తూ వస్తున్న లారెన్స్ ఎట్టకేలకు సినిమా పూర్తి చేశాడు.

ప్రస్తుతం ఈచిత్రానికి దక్కిన శాటిలైట్ రైట్స్ రేటు చూస్తుంటే బిజినెస్ బాగానే జరుగుతుందని స్పష్టం అవుతోంది. లారెన్స్, ప్రభాస్ గత సినిమాలు విజయంతం అవడం కూడా ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి మరోకారణం. రెబల్‌గా ముద్రపడ్డ ఓ యువకుడు ఎదురు తిరిగి నిలిస్తే ఎలా ఉంటుంది? అణిగిమణిగి ఉన్నంత కాలం పిల్లి కూడా మనకు ఎదురు తిరుగుతుంది. తిరుగుబావుటా ఎగరేస్తే పులి కూడా వెనక్కు పరుగెడుతుంది అనే కాన్సెప్టుతో ఈచిత్రాన్ని రూపొందించారు.

ఈచిత్రంపై హీరో ప్రభాస్ చాలా కమిట్ మెంట్‌గా పని చేస్తున్నా...దర్శకుడు లారెన్స్ మాత్రం తన తలబిరుసు వ్యవహారాలతో ఇంతకాలం షూటింగు ఆలస్యం చేస్తూ వస్తున్నాడు. లారెన్స్ వ్యవహార శైలి వల్లనే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్పుకున్నాడు. దీంతో తానే సంగీతం అందించాల నిర్ణయించుకున్నాడు లారెన్స్. ఇంకా చాలా విషయాల్లోనూ లారెన్స్ ఆగడాలకు అంతులేకుండా పోయిందని ఫిల్మ్ నగర్ సమాచారం.

మరి సినిమా హిట్టయితే ఫర్వాలేదు కానీ...పరిస్థితి తేడా వస్తే మాత్రం లారెన్స్ తెలుగు పరిశ్రమలోని వారంతా పక్కన పెట్టడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగబోతోందో చూడాలి. ఈచిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: 'డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X