ప్రభాస్..'ఓరి నాయనో... నువ్వెంత గొప్పవాడురో...'
హైదరాబాద్ :ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రెబల్'. తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్స్ . రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రాన్ని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో హీరో,హీరోయిన్స్ పై ఓ గీతాన్ని చిత్రిస్తున్నారు. 'ఓరి నాయనో... నువ్వెంత గొప్పవాడురో...' అంటూ సాగే ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించారు.
''ప్రభాస్ అభిమానులకు ఇది పండగలాంటి సినిమా. ప్రభాస్‌ని ఏ విధంగా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారో ఇందులో ఆయన పాత్ర అలానే ఉంటుంది'' అన్నారు జె.భగవాన్, జె.పుల్లారావు. లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్, తమన్నా, దీక్షాసేథ్ కాంబినేషన్‌లో ఈ ఇద్దరూ నిర్మిస్తున్న చిత్రం 'రెబల్'. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఏడెకరాలులో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -''ప్రభాస్, తమన్నా, 30 మంది డాన్సర్లు పాల్గొనగా ఈ పాటను చిత్రీకరిస్తున్నాం. 'ఓరి నాయనో నువ్వెంత గొప్పవాడురో... నువ్వెంత పెద్దవాడురో... నువ్వెంత మంచివాడురో..' అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట చాలా హుషారుగా సాగుతుంది. ఈ నెల మూడో వారంలో టీజర్‌ను, నాలుగో వారంలో పాటలను విడుదల చేస్తాం. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.
ఈ చిత్రంలో ప్రభాస్ క్యారక్టరైజేషన్ చాలా డిఫెరెంట్ గా ఉంటుందంటున్నారు దర్శకుడు లారెన్స్. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ...మా సినిమా లో హీరో కూర్చుని కబుర్లు చెప్పే రకం కాదు. రంగంలోకి దిగి చేసి చూపిస్తాడు. ఏటికి ఎదురీదడం అతనికిష్టం. పోరాడైనా గెలవడం అతని నైజం. ఇంతకీ అతని లక్ష్యం ఏంటి? అనేది మా చిత్రంలో చూడాల్సిందే అన్నారు. అలాగే ప్రభాస్ శైలికి సరిపోయే చిత్రమిది.'రెబల్' అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. 'రెబల్' అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా 'ఛత్రపతి'. ఆ సినిమాను మించే స్థాయిలో మా 'రెబల్' ఉంటుంది మాస్‌ని అలరించేలా ఫైట్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అందరికీ నచ్చుతుంది అన్నారు.
తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. వేసవిలో 'రెబల్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ప్రభాస్ కెరీర్‌లోనే 'రెబల్' హై బడ్జెట్ ఫిలిం అవుతుంది.షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరిందని నిర్మాతలు చెప్తున్నారు. మా బేనర్‌లోనే కాదు, ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం'' అని చెప్పారు. కృష్ణంరాజు ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ముఖేష్ రుషి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, ప్రభ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: 'డార్లింగ్' స్వామి, కెమెరా: సి.రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కథ-స్క్రీన్‌ప్లే-కొరియోగ్రఫి, సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











