ఫామ్ కోల్పోయిన నిర్మాతను మళ్ళీ ఫ్రేమ్ లోకి తీసుకొస్తున్న రియల్ హీరో..
తెరపై స్టార్ హీరోగా ఎప్పుడో ఎదిగిపోయిన ప్రభాస్ ఇప్పుడో విషయంలో అందరి మెప్పు పొందే రియల్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు సినిమా చేస్తోన్న ప్రభాస్ త్వరలో లారెన్స్ డైరెక్షన్ లోనూ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. కాగా ఎన్నీ కమిట్ మెంట్స్, ఎందరో ప్రొడ్యూసర్స్ వుండడంతో ప్రభాస్ లారెన్స్ ల సినిమా ఈ బేనర్ లోనే వుంటుందంటూ పలు సంస్థల పేర్లు వినిపించాయి.
అయితే ఎప్పుడో మూడేళ్ళక్రితం అడ్వాన్స్ ఇచ్చి, అప్పట్నుంచీ తన పిలుపు కోసం ఎదురుచూస్తోన్న జె భగవాన్ - ఫుల్లారావులకు ఆ సినిమా చెయ్యబోతున్నాడు ప్రభాస్. నిజానికి డివివి దానయ్యతో విడిపోయాక నిర్మాతలుగా వెనుకబడ్డ భగవాన్-పుల్లారావులకు మళ్ళీ మరో పెద్ద హీరో సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో ఎవ్వరూ అనుకోలేదు. అయితే తను ఇచ్చిన కమిట్ మెంట్ కి కట్టుబడిన యంగ్ రెబల్ స్టార్ ఇలా ఫామ్ కోల్పోయిన నిర్మాతలను మళ్ళీ ప్రేమ్ లోకి తీసుకురావడం విశేషమేగా..!


Click it and Unblock the Notifications











