యువ హీరోతో ప్రభాస్ సీక్రెట్ భేటి.. కారణం అదేనట!

Recommended Video

KGF Star Yash Net Baahubali Prabhas In Mumbai Why ? | Filmibeat Telugu

దక్షిణాదిలోని సినీ తారలు మధ్య మంచి రిలేషన్స్ ఉంటాయన్నది జగమెరిగిన సత్యమే. ఎక్కడైనా ఎదురు పడినా లేదా ఏదైనా ఫంక్షన్‌లో కనిపించినా అరమరికలు లేకుండా మాట్లాడుకొంటారు. తాజాగా కన్నడ నటుడు యష్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముంబైలో కలుసుకోవడం మీడియాలో ప్రముఖంగా మారింది. వీరి కలయిక వెనుక సీక్రెట్ ఇదేనట..

 ప్రభాస్‌కు ప్రజాదరణ

ప్రభాస్‌కు ప్రజాదరణ

బాహుబలి గ్రాండ్ సక్సెస్‌తో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్‌కు ప్రజాదరణ పెరిగింది. ప్రస్తుతం సాహో సినిమాతో సిద్దమవుతున్నాడు. వీరిద్దరూ ముంబైలో వేర్వేరు పనుల మీద ఉన్నారు. ముంబైలోని పాలి భవన్‌లో అనుకోకుండా కలుసుకోవడం జరిగిందట.

ప్రస్తుతం ముంబైలో

ప్రస్తుతం ముంబైలో

సాహో చిత్ర షూటింగ్ కోసం ప్రభాస్ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. అలాగే యష్ కేజీఎఫ్ సినిమా ప్రమోషన్ కోసం ముంబై వెళ్లాడు. ఈ సందర్భంగానే శనివారం వీరి మధ్య భేటి జరిగిందట. వాస్తవానికి యష్, ప్రభాస్ మీటింగ్ అనుకోకుండా జరిగిందట.

కేజీఎఫ్‌పై భారీ అంచనాలు

కేజీఎఫ్‌పై భారీ అంచనాలు

కన్నడ సూపర్‌స్టార్ యష్ మార్కెట్ కేవలం శాండల్‌వుడ్‌కే పరిమితం. కానీ కేజీఎఫ్ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎట్రాక్షన్‌గా మారింది.ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్‌ను పలు భాషల్లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో యష్ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు.

 కంటెంట్ బాగుంటే సినిమాను

కంటెంట్ బాగుంటే సినిమాను

బాహుబలి సినిమా సక్సెస్ కారణంగానే కేజీఎఫ్‌ను హిందీలోకి డబ్ చేయాలని డిసైడ్ అయ్యాం. కంటెంట్ బాగుంటే సినిమాను ఏ భాషలోనైనా ఆదరిస్తారనే విషయం బాహుబలి మాకు స్ఫూర్తినిచ్చింది అని యష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దక్షిణాదిలో కేజీఎఫ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌గా అంచనాలను పెంచుకొన్నది.

కేజీఎఫ్‌కు ప్రభాస్ అండ

యష్, ప్రభాస్ భేటి సందర్భంగా పలు విషయాలు చర్చకు వచ్చాయట. కేజీఎఫ్ సినిమాపై పెరిగిన అంచనాలను ప్రభాస్ ప్రస్తావించడట. ఈ సందర్భంగా కేజీఎఫ్‌కు సహకారం అందించాలని ప్రభాస్‌ను యష్ కోరినట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి. అందుకు ప్రభాస్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X