»   » ప్రభాస్ విగ్రహం చూసేందుకు పోటీపడుతున్న అభిమానులు!

ప్రభాస్ విగ్రహం చూసేందుకు పోటీపడుతున్న అభిమానులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్: మేడమ్ టుస్సాడ్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ సెలబ్రిటీల మైనపు విగ్రహాలను తయారు చేసి లండన్, బ్యాంకాక్, హాంకాంగ్, సింగపూర్‌లలో ఉన్న తమ మ్యూజియంలలో ప్రతిష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సౌతిండియా నుండి మొదటి సారి బాహుబలి స్టార్ ప్రభాస్‌కు అవకాశం దక్కింది.

    బాహుబలి-2 షూటింగ్ సమయంలోనే ప్రభాస్ కొలతలు తీసుకెళ్లిన మ్యూజియం ప్రతినిధులు.... బాహుబలి-2 సినిమా విడుదల సమయంలో బ్యాంకాక్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కళ్లు చెదిరేలా ఎంతో అద్భుతంగా ప్రభాస్ మైనపు విగ్రహాన్ని రూపొందించారు. బాహుబలి 2 మూవీ భారీ విజయం సాధించడంతో ఇండియా నుండి బ్యాంకాక్ వెళ్లిన ఫ్యాన్స్ బాహుబలి విగ్రహాన్ని చూసేందుకు ప్రత్యేకంగా వెలుతున్నారట.

    ఫ్యాన్స్ ఫిదా...

    ఫ్యాన్స్ ఫిదా...

    మేడమ్ టుస్సాడ్స్‌లో తమ అభిమాన నటుడి విగ్రహం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. సౌతిండియా నుండి తాము అభిమానించే హీరోకే ఆ అవకాశం దక్కడం చాలా హ్యాపీగా ఉన్నారు. కొందరు ప్రభాస్ అభిమానులు ఈ విగ్రహం చూసేందుకు ప్రత్యేకంగా వెలుతున్నారు.

    కోట్లలో ఖర్చు

    కోట్లలో ఖర్చు

    అచ్చం మనిషిని పోలి ఉండే ఈ విగ్రహాల తయారీకి కూడా ఖర్చు భారీగానే అవుతుంది. ఒక్కో విగ్రహం తయారీకి లక్షా యాభై వేల బ్రిటిష్ పౌండ్లు ఖర్చవుతున్నాయి. అంటే మన కరెన్సీలో ఒక్కో విగ్రహం తయారీకి అయ్యే ఖర్చు దాదాపు రూ. కోటిన్నర...

    విగ్రహం గురించి ప్రభాస్

    విగ్రహం గురించి ప్రభాస్

    మా ఫ్రెండ్ ఫోన్ చేసి మేడమ్ టుస్సాడ్స్ వారు నీ విగ్రహం మ్యూజియంలో పెడతామంటున్నారని చెప్పగానే నేను నమ్మలేక పోయాను. బాహుబలిలో అద్భుతం జరిగితే ఏదేదో జరుగుతాయని అనుకున్నాం కానీ మేడమ్ టుస్సాడ్స్ వారు సైతం వస్తారని అసలు ఊహించలేదు... అని ప్రభాస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

    సౌండియాలో ఇదే తొలిసారి

    సౌండియాలో ఇదే తొలిసారి

    ఆ సమయంలో నేను బాహుబలి షూటింగులో ఉన్నాను. ఈ విషయం రాజమౌళికి చెప్పగానే చాలా సంతోష పడ్డాడు. సౌతిండియా నుండి ఇదే తొలిసారి. ఓసారి వచ్చి హాఫ్ డే పాటు కొలతలు తీసుకున్నారు. సూపర్ హీరోలు కెప్టెన్ అమెరికా, స్పైడర్ మ్యాన్ లాంటి విగ్రహాల మధ్యలో మన బాహుబలి ఉంటదంటే సంతోషంగా అనిపించిందని ప్రభాస్ తెలిపారు.

    డబ్బులడలేదంటూ ప్రభాస్

    డబ్బులడలేదంటూ ప్రభాస్

    ఆ మధ్య ఇంటర్వ్యూలో.... మీరు హైట్ ఎక్కువ కదా, మీ విగ్రహానికి కాస్త వాక్స్ ఎక్కువ పడుతుంది కదా... అని యాంకర్ సుమ చమత్కరించడంతో ప్రభాస్ నవ్వేసారు. కొలతలు తీసుకెళ్లారు కానీ వాళ్లకి ఎంత వాక్స్ అవసరం అవుతుందో తెలియదు... మనల్ని అయితే డబ్బులు అడగలేదు అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

    English summary
    Rebel Star Prabhas's wax statue at Madame Tussauds. Check out photos.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more