అది అవసరమా డార్లింగ్స్.. రెబల్ స్టార్ స్వీట్ వార్నింగ్..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలన కోసం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమ కూడా మద్దతుగా నిలుస్తోంది. ఇందులో భాగంగా సినీ ప్రముఖులు డ్రగ్స్, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ పలువురు తన సందేశాన్ని ప్రజలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తనదైన స్టైల్లో ముందుకు వచ్చాడు.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ.. 'లైఫ్ లో మనకి బోలెడన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు.. మనకోసం బ్రతికే మనవాళ్లు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్. డ్రగ్స్ కు నో చెప్పండి' అంటూ ప్రభాస్ విజ్ఞప్తి చేశాడు.

'మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ బానిసైతే.. 8712671111 నెంబర్ కు కాల్ చేసి తెలియజేయండి. వారు పూర్తిగా కోరుకునేంతవరకు తెలంగాణ ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది' అంటూ వీడియోలో తెలియజేశారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) అవగాహన వీడియో ఇపుడు ఆలోచింపజేస్తుంది. మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ రెబల్ స్టార్ ప్రభాస్ ఇచ్చిన సందేశం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇదిలాఉంటే.. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది కల్కి 2898 ఏడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ మైథో సైన్స్ ఫిక్షన్ మూవీ దాదాపు రూ. 1,200కోట్లు పైగా వసూల్ చేసి.. పలు రికార్డుల సెట్ చేసింది. వచ్చే ఏడాది ప్రభాస్.. డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2025 ఏప్రిల్ 10న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే వెల్లడించింది.

ఈ మూవీ తరువాత హను రాఘవపూడితో ఓ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది. పీరియడ్ యాక్షన్ మూవీకి ఫౌజీ అనే పేరు పెట్టారు. ఈ మూవీ తరువాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చిత్రం కూడా ప్రభాస్ లైనప్‍లో ఉంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా రెబల్ స్టార్ కనిపించబోతున్నారు. ఆ తరువాత ప్రశాంత్ నీల్‍తో సలార్ 2 కూడా ప్రభాస్ చేయాల్సి ఉంది. కల్కి 2 చిత్రం కూడా లైనప్‍లో ఉంది. ఇలా వరుస సినిమాతో ప్రభాస్ పుల్ బిజీ అయ్యారు.


Click it and Unblock the Notifications











